Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్‌కి మ‌ళ్లీ ప్ర‌మాదం

ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు రేస్ కోర్ట్‌లో కార్ రేసింగ్.. త‌ళా అజిత్ ప్ర‌యాణం సాహ‌సాల‌తో ముందుకు సాగుతోంది.

By:  Tupaki Desk   |   20 July 2025 11:13 PM IST
త‌ళా అజిత్‌కి మ‌ళ్లీ ప్ర‌మాదం
X

ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు రేస్ కోర్ట్‌లో కార్ రేసింగ్.. త‌ళా అజిత్ ప్ర‌యాణం సాహ‌సాల‌తో ముందుకు సాగుతోంది. అత‌డు కార్ రేసర్ గాను ఎదురే లేని హీరోగా స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. అజిత్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన రేస‌ర్ గా ట్రాక్ పై కార్ ని ప‌రుగులు పెట్టిస్తుంటే, అభిమానుల‌కు కొన్నిసార్లు అది చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

50 ప్ల‌స్‌లోను అత‌డి స్పీడ్ నిజానికి అంద‌రినీ భ‌య‌పెడుతోంది. వ్యానిటీ వ్యాన్‌లు, ల‌గ్జ‌రీ సూట్‌ల‌లో జీవితానికి భిన్నంగా అత్యంత సాహ‌సోపేత‌మైన రేసింగ్ తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న అజిత్ ప‌లుమార్లు రేసింగ్ ట్రాక్ పై భారీ ప్ర‌మాదాల‌కు గుర‌వ్వ‌డ‌మే దీనికి కార‌ణం. రేస‌ర్ గా అసాధార‌ణ విజ‌యాల‌ను సాధిస్తున్నా, అత‌డి అభిమానుల‌ను ఈ ప్ర‌మాదాలు నిరంత‌రం టెన్ష‌న్ పెడుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం త‌ళా అజిత్ బెల్జియంలోని ఐకానిక్ స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్ సర్క్యూట్‌లో GT4 యూరోపియన్ సిరీస్ మూడవ రౌండ్‌కు సిద్ధమవుతున్నాడు. కానీ రేస్ ప్రారంభమయ్యే ముందు అజిత్ ఈనె 25న‌ క్రౌడ్‌స్ట్రైక్ 24 అవర్స్ ఆఫ్ స్పా 2025 డ్రైవర్ పరేడ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. తాజాగా మ‌రోసారి ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఇట‌లీ మిసానోలో రేస్ 2 ట్రాక్ పై వెళుతూ ఆగి ఉన్న కార్ ని అజిత్ ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అత‌డు రేస్ నుంచి త‌ప్పుకోవాల్సి రాగా, ప్ర‌మాద స్థ‌లంలో క్లీనింగ్ కార్మికుల‌కు అజిత్ స‌హ‌క‌రిస్తూ క‌నిపించారు. అత‌డి ఒదిగి ఉండే స్వ‌భావం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

నిజానికి అజిత్ రేస‌ర్ గా ద‌శాబ్ధం పైగానే అనుభం ఘ‌డించారు. జర్మనీ, మలేషియా వంటి దేశాలలో అంతర్జాతీయంగా పోటీ పడిన అజిత్ కుమార్ చాలా కాలంగా సినిమాలు, రేసింగ్ ని బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాడు. 2003 ఫార్ములా బిఎండ‌బ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రేస‌ర్ గా ఆరంగేట్రం చేశాడు. తరువాత 2010 ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్ సవాల్‌ను స్వీకరించాడు. 2025లో అజిత్‌కు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర గౌరవమైన ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు లభించింది.