Begin typing your search above and press return to search.

తార‌క్ లా బిర్యానీ మాస్ట‌ర్ అయిన మ‌రో స్టార్ హీరో!

తాజాగా త‌ల అజిత్ కూడా ఇలాంటి విష‌యాలో త‌క్కువేం కాద‌ని తెలుస్తోంది. రేసింగ్, ఫోటోగ్రఫీ వంటి అభిరుచులతో పాటు అజిత్ కు వంట చేయడం ఎంతో ఇష్టమ‌ని తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   31 March 2026 6:23 PM IST
తార‌క్ లా బిర్యానీ మాస్ట‌ర్ అయిన మ‌రో స్టార్ హీరో!
X

నాన్ వెజ్ వంట‌కాలు..బిర్యానీలు వండ‌టంలో మాస్ట‌ర్ ఎవ‌రు? అంటే అంతా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పేరు చెబుతారు. ఆదివారం వ‌చ్చిందంటే తార‌క్ చేతివాటం చూపించాల్సిందే. కొంత కాలంగా ఫిట్ నెస్ పై శ్ర‌ద్ద‌తో నాన్ వెజ్ వంట‌కాలు దూరంగా ఉన్నా? ఇంటికి ఎవ‌రైనా అతిధులు వ‌స్తే మాత్రం త‌ప్ప‌క బిర్యానీ చేస్తుంటారు. త‌న చేతితో వండి వార్చ‌నిదే తార‌క్ కి సంతృప్తిగా అనిపించదు. తార‌క్ వంట‌కాలు రుచి చూసిన సెల‌బ్రిటీలు ఎంతో మంది. తాజాగా త‌ల అజిత్ కూడా ఇలాంటి విష‌యాలో త‌క్కువేం కాద‌ని తెలుస్తోంది. రేసింగ్, ఫోటోగ్రఫీ వంటి అభిరుచులతో పాటు అజిత్ కు వంట చేయడం ఎంతో ఇష్టమ‌ని తెలుస్తోంది.

తాజాగా `ఎఫ్ సీ మద్రాస్ ఫుట్‌బాల్ క్లబ్` క్రీడాకారుల కోసం స్వయంగా బిర్యానీ వండి వార్తల్లో నిలిచారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన భార్య శాలిని కూడా తోడవ్వడంతో ఆ వేడుక మరింత సందడిగా మారింది. సాధారణంగా షూటింగ్ సెట్స్‌లో తన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అజిత్ రేర్ గా స్వయంగా వంట చేసి వ‌డ్డిస్తుంటారు. అయితే ఈసారి ఏకంగా ఒక ఫుట్‌బాల్ జట్టు మొత్తానికి ఆయన బిర్యానీ సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అజిత్ పెద్ద పాత్రలో మసాలాలు వేస్తూ, ఎంతో నిశితంగా వంటను పర్యవేక్షిస్తూ కనిపించారు.

ఆయన అంకితభావాన్ని చూసి అక్కడున్న క్రీడాకారులు ఫిదా అయిపోయారు. ఈ వంట ప్రక్రియ జరుగుతోన్న సమయంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అజిత్ బిర్యానీ వండుతుండగా ఆయన భార్య శాలిని అక్కడికి వచ్చి ఒక సూపర్ వైజర్ లా పోజు ఇచ్చారు. `నేను చెప్పినట్టే వండావా?` అంటూ ఆమె అజిత్‌ను సరదాగా ఆట పట్టించారు. శాలిని వేసిన ఈ జోక్‌కు అజిత్ తో పాటు చుట్టూ ఉన్న వారందరూ బిగ్గ‌ర‌గా నవ్వుకున్నారు. ఈ క్యూట్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా సెట్స్ లో వండించ‌డంలో ప్ర‌భాస్ కూడా స్పెష‌లిస్టే.

తాను స్వ‌యంగా వంట చేయ‌డు గానీ..త‌న వెంట ఎప్పుడు కుక్స్ ఉంటారు. వారితో స్వ‌యంగా వండిచి సెల‌బ్రి టీల‌కు పంపిస్తుంటాడు. త‌న‌తో ఏ హీరోయిన్ సినిమా చేసినా? డార్లింగ్ ఇంట వంట‌లు రుచి చూడాల్సిందే.అప్పుడ‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా గ‌రిట ప‌డుతుంటారు. త‌న‌కు ఇష్ట‌మైన వారు ఇంటికొచ్చిన‌ప్పుడు తెలిసిన వంట‌కాలు చేస్తుంటారు. ఆ మ‌ధ్య స్నేహితుడు నాగార్జున‌ను ఇంటికి పిలిపించి చిరంజీవి స్వ‌యంగా రొయ్య‌లు, చేప‌ల క‌ర్రీ త‌యారు చేసారు. చిరంజీవి మామ్ అంజ‌నా దేవి కూడా రుచిక‌రమైన‌ వంట‌కాలు చేస్తార‌ని పేరుంది. అత్త‌మ్మ నుంచే కోడ‌లు సురేఖ ఎన్నో ర‌కాల వంట‌కాలు నేర్చుకున్నారు. వారిలో ఆట్యాలెంట్ గుర్తించిన మెగా కోడ‌లు ఉపాస‌న అత్తామాస్ కిచెన్ ప్రారంభించి బిజినెస్ కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.