పాదాలకు ముద్దు.. తళా అజిత్ సడెన్‌గా ఏంటిలా?
తళా అజిత్ కుమార్ కనుసైగతో శాసించగలడు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది.
By: Tupaki Desk | 21 May 2025 11:17 PM ISTతళా అజిత్ కుమార్ కనుసైగతో శాసించగలడు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. అంత పెద్ద స్టార్ డమ్, అంతటి విస్త్రతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఏమిటీ ఇక్కడ ఇలా ఒక వ్యక్తి పాదాలను ముద్దాడుతున్నాడు?
చాలా మంది సందేహమిది. ఇటీవల అజిత్ ఇటలీ పర్యటనలో ఎదురైన అరుదైన దృశ్యమిది. అజిత్ ఒక పార్కులో లెజెండరీ ఫార్ములా 1 డ్రైవర్ అయర్టన్ సెన్నా విగ్రహం చెంత ఉన్నాడు. అక్కడ ఎలాంటి హడావిడి లేకుండా అహంతో పని లేకుండా, వంగి విగ్రహం పాదాలను ముద్దు పెట్టుకున్నాడు. ఇది చూడగానే మరోసారి తళా సింప్లిసిటీ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. అజిత్ ఏం చేసినా అది ప్రత్యేకంగా ఉంటుంది. అర్థవంతంగా ఉంటుంది.. ఇప్పుడు కూడా తళా తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
బ్రెజిలియన్ రేసింగ్ దిగ్గజం అయర్టన్ సెన్నా మూడు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. ఒక క్రీడాకారుడిగా ఆల్ టైమ్ లెజెండ్స్ జాబితాలో చేరారు. అజిత్ చెన్నాకు వీర విధేయుడు అని అతడి చర్య చెబుతోంది. అజిత్ సినిమాల్లో నటిస్తూనే, రేసర్ గాను సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ప్రమాదాలు భయపెడుతున్నా దేనినీ ఖాతారు చేయక ఫార్ములా వన్ రేసింగ్ లో దూసుకుపోతున్నాడు. 1994లో సెన్నా విషాదకరమైన మరణం తర్వాత ఈ క్రీడ ఎంతటి ప్రమాదకరమైనదో అభిమానులు గుర్తు చేసుకుంటారు. కానీ తన గురువు సెన్నా బాటలోనే అజిత్ రేసింగుకి వెళుతుండడం ఆశ్చర్యపరుస్తుంది.
