Begin typing your search above and press return to search.

నేను యాక్సిడెంట‌ల్ న‌టుడిని: త‌ళా అజిత్

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌తిభావంతుడైన స్టార్ గా త‌ళా అజిత్ కుమార్ హృద‌యాల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   1 May 2025 5:30 PM
నేను యాక్సిడెంట‌ల్ న‌టుడిని: త‌ళా అజిత్
X

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌తిభావంతుడైన స్టార్ గా త‌ళా అజిత్ కుమార్ హృద‌యాల్లో నిలిచారు. త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి మాస్ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న స్టార్ అత‌డు. ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో పోటీప‌డుతూ కోలీవుడ్ లో హ‌వా సాగిస్తున్నాడు. అయితే ఇటీవ‌లి కాలంలో అత‌డు మోటార్ రేసింగ్ పై దృష్టి సారించి సినిమాల‌ను త‌గ్గించుకున్నాడు. ఇది నిజానికి అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు. అయితే ఇప్పుడు త‌ళా అజిత్ ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ ప్ర‌జ‌ల్లో హాట్ టాపిగ్గా మారింది.

ఇటీవ‌లే ప్ర‌తిష్టాత్మ‌క పద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్న అజిత్.. ఇప్పుడు అక‌స్మాత్తుగా త‌న‌ను తాను యాక్సిడెంట‌ల్ స్టార్ అని అన్నాడు. నిజానికి రంగుల‌ ప్రపంచంలో భాగం కావాలని తాను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని అనుకోకుండా న‌టుడ‌య్యాన‌ని అజిత్ అన్నారు. అజిత్ మాట్లాడుతూ-``నటన ఎప్పుడూ నా దృష్టిలో లేదు. నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ని. స్కూల్ చ‌దువుల తర్వాత ఆటోమొబైల్ రంగంలో పని చేసాను`` అని అజిత్ తెలిపారు. నేను మోటార్ సైకిళ్లను రేసింగ్ చేయడం ప్రారంభించినప్పుడు నాకు 18 సంవత్సరాలు. ఇది చాలా ఖరీదైన క్రీడ అని, తాను ఆదుకోలేని స్థితిలో ఉన్నాన‌ని, నీ సొంత‌ మార్గాన్ని కనుక్కోవాలి అని త‌న‌ తండ్రి అన్నార‌ని గుర్తు చేసుకున్నారు. నేను రేస్ ట్రాక్ వద్ద ఉన్నప్పుడు ఒక మోడల్ కోఆర్డినేటర్ నన్ను సంప్రదించి విజిటింగ్ కార్డ్ ఇచ్చి, నాకు ఆసక్తి ఉంటే కాల్ చేయమని చెప్పాడు. ఆ త‌ర్వాత‌ నేను ప్రింట్ యాడ్స్, టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ప్రారంభించాను! అని అజిత్ తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు.

నా అప్పుల్ని తీర్చేయాల‌ని అనుకున్నాను. దాని కోసం ఓ రెండు సినిమాలు చేస్తే స‌రిపోతుంద‌ని అనుకున్నాను. నాకు పేరు రావాల‌ని ప‌రిశ్ర‌మ‌కు రాలేదు! అని అజిత్ చెప్పారు. త‌ళా అజిత్ కుమార్ 1990లో తమిళ చిత్రం `ఎన్ వీడు ఎన్ కనవర్‌`తో న‌టుడిగా రంగప్రవేశం చేశాడు. అయితే క‌థానాయ‌కుడిగా తెలుగు చిత్రం `ప్రేమ పుస్తకం`తో కెరీర్ ప్రారంభించాడు. అజిత్ ఇటీవల `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింద‌ని త‌మిళ మీడియా వెల్ల‌డించింది.