Begin typing your search above and press return to search.

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. వసూళ్ల సంగతేంటి?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 April 2025 8:42 AM
Good Bad Ugly Shatters Box Office with ₹200 Crore Gross
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించారు.

ఆమెతోపాటు ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించారు. అయితే అజిత్ రీసెంట్ మూవీ విడామయూర్చిలోనూ త్రిషనే హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. బ్యాక్ టు బ్యాక్ జోడీగా అలరిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.. అజిత్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అజిత్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రిలీజ్ అయిన ఐదు రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. ఫస్ట్ డే రూ.33 కోట్ల రాబట్టగా.. ఐదు రోజుల్లో క్రేజీ మార్క్ టచ్ చేసి అబ్బురపరిచింది. ఆ విషయాన్ని మేకర్సే అనౌన్స్ చేశారు.

అయితే డే 1 నుంచి సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ.. వారం రోజుల థియేట్రికల్ రన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వనప్పటికీ.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. గుడ్ బ్యాడ్ అగ్లీలో యోగిబాబు, రాహుల్‌ దేవ్‌, సునీల్‌, ప్రభు సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అర్జున్ దాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. డ్యూయల్ రోల్ లో సందడి చేశారు. చాలా ఏళ్ల తర్వాత సీనియర్ నటి సిమ్రాన్.. అజిత్ తో యాక్ట్ చేయడం విశేషం.

ప్రియా వారియర్ స్పెషల్ డ్యాన్స్ తో అలరించగా.. జీఎస్ ప్రకాష్ స్వరాలు అందించారు. ఒక గ్యాంగ్‌ స్టర్ తన ఉద్యోగాన్ని వదులుకుని కుటుంబం కోసం హీరోగా మారడమే సినిమా అని రివ్యూస్ వస్తున్నాయి. సినిమాలో తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. మరి ఫుల్ రన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.