Begin typing your search above and press return to search.

హీరోయిన్ క‌టౌట్..కానీ డాడ్ ఒప్పుకుంటాడా?

తాజాగా అజిత్ హీరోగా న‌టించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్ అయిన నేప‌థ్యంలో ప్రీమియ‌ర్ షోలో కుమార్తె అనౌష్క త‌ళుక్కున మెరిసింది.

By:  Tupaki Desk   |   11 April 2025 4:11 PM IST
హీరోయిన్ క‌టౌట్..కానీ డాడ్ ఒప్పుకుంటాడా?
X

త‌ల అజిత్ స్టార్ హీరోగా కోలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఆయ‌న స‌తీమ‌ణి షాలిని మాత్రం వివాహం త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అప్పుడ‌ప్పుడు సినిమా ఈవెంట్ల‌కు మాత్రం హాజ‌ర‌వుతుంటారు. ఇక అజిత్ పిల్ల‌ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ దంప‌తుల‌కు కుమారుడు..కుమార్తె గ‌ల‌రు. సినిమా ఈవెంట్లోలో క‌నిపించ‌డం చాలా రేర్. విదేశాల్లో చ‌దువుకుంటున్నారు.

తాజాగా అజిత్ హీరోగా న‌టించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్ అయిన నేప‌థ్యంలో ప్రీమియ‌ర్ షోలో కుమార్తె అనౌష్క త‌ళుక్కున మెరిసింది. మామ్ షాలినీతో క‌లిసి షో టైమ్ లో థియేట‌ర్ లో అటెండ్ అయింది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైల‌ర్ అవుతుంది. షాలిని-అనౌష్క‌ని ఒకే ప్రేమ్ లో చూస్తుంటే త‌ల్లీ కూతుళ్లా? ఇద్ద‌రు హీరోయి న్లా? అన్న సందేహం రావ‌డం స‌హ‌జ‌మే.

అనౌశ్క రెండ్ బ్లాక్ కాంబినేష‌న్ దుస్తుల్లో మెరిసి పోతుంది. అనౌష్క అచ్చంగా అమ్మ‌-నాన్న పోలిక‌ల‌తో నిండిపోయింది. ప్యూచ‌ర్ హీరోయిన్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అనౌష్క‌కి 17 ఏళ్లు. మేజ‌ర్ అవ్వ‌డానికి మ‌రో ఏడాది స‌మ‌యం ప‌డుతుంది. మ‌రి కుమార్తెను సినిమాల్లోకి తీసుకొస్తారా? చ‌దువు ఉద్యోగం అంటూ విదేశాల్లోనూ ఉంటుందా? అన్న‌ది చూడాలి.

సినిమాల విష‌యంలో అజిత్ కుమారుడు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ కుమార్తెను ఈ రంగంలోకి తీసుకొస్తాడా? అంటే సందేహ‌మే. ఎందుకంటే షాలిని వివాహం త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అజిత్ కూడా సినిమాలంటే మునుప‌టిలా ఆస‌క్తి చూపించ‌లేదు. కార్ రేసింగ్ పై ఉన్న శ్ర‌ద్ద సినిమాల‌పై లేదు. అభిమానుల విష‌యంలో ఆయ‌న మాట్లాడే తీరు ఎంతో ప్రాక్టిక‌ల్ గా ఉంటుంది.వీట‌న్నింటి ఒకే గ్లాస్ లో ఒడ‌పొస్తే కుమార్తె ఎంట్రీకి ఆయ‌న అంగీక‌రిస్తాడా? అన్న‌ది స‌స్పెన్స్. మ‌రి అనౌష్క వ్య‌క్తిగ‌తంగా సినిమాలంటే ఇంట్రెస్ట్ ? లేదా? అన్న‌ది ఎప్పుడూ చెప్పింది లేదు.