స్టార్ హీరో # 64 సంగతేంటో తేలేది ఎప్పుడంటే?
64 రేసులో మాత్రం చాలా మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆలస్యమయ్యే కొద్ది ఇంకా కొత్త కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 2 July 2025 11:46 AM ISTతల అజిత్ 64వ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. భారీ కాన్వాస్ పై ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అన్నది మాత్రం ఇంత వరకూ తేలలేదు. 64 రేసులో మాత్రం చాలా మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆలస్యమయ్యే కొద్ది ఇంకా కొత్త కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజ్, నితిలన్ స్వామినాథన్, ప్రశాంత్ నీల్, విష్ణువర్ధన్, వెంకట్ ప్రభు, ఆధిక్ రవిచంద్రన్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.
కానీ అజిత్ ఛాన్స్ ఎవరికిచ్చారు? అన్నది మాత్రం తేలలేదు. గత చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ` మంచి విజయం సాధించడంతో అధిక్ రవిచంద్రన్ తో మరో సినిమా చేస్తానని అజిత్ ప్రకటించారు. కానీ ఆ సినిమా నెంబర్ మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం చేయాల్సిన సినిమా నెంబర్ 64. ఈ నేపథ్యంలో ఆ నెంబర్ ఏ డైరెక్టర్ సొంతం చేసుకుంటాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా దానికి సంబంధించి ముహూర్తం పెట్టేసారు .
ఆగస్టులో ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారుట. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు ఎవరు? బ్యానర్ ఏంటి? అన్నది ముందుగా క్లారిటీ ఇవ్వనున్నారుట. అటుపై హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడించనున్నారు. `గుడ్ బ్యాడ్ అగ్లీ` రిలీజ్ అనంతరం అజిత్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
ఆయనకు కార్ రేసింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. ఖాళీ సమయాన్ని రేసింగ్ కోసమే కేటాయిస్తుంటాడు. ఈ మధ్య రేసింగ్ లో యాక్సిడెంట్స్ జరగడంతో వేగం తగ్గించారు. రేసింగ్ పై ఆసక్తితో సినిమాలు కూడా తగ్గిస్తున్నా నని అజిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
