Begin typing your search above and press return to search.

అజిత్ తో మరో బిగ్ స్టార్.. కన్నప్ప తరువాత ఇలా..

తమిళ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా గుడ్ బాడ్ అగ్లీ కమర్షియల్ గా భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:53 AM
అజిత్ తో మరో బిగ్ స్టార్.. కన్నప్ప తరువాత ఇలా..
X

తమిళ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా గుడ్ బాడ్ అగ్లీ కమర్షియల్ గా భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ముందుగా మార్క్ ఆంటోనీ సినిమాతో తన ప్రత్యేకమైన కథన శైలిని చాటిన అధిక్, ఇప్పుడు అజిత్ ట్రస్ట్‌ను కూడా సంపాదించేశాడు. అందుకే వెంటనే మరో సినిమా చేయాలని అజిత్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం వీరు కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌ను AK 64 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటంటే.. ఈ సినిమాలో మరో బిగ్ స్టార్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. కన్నప్ప సినిమాలో స్పెషల్ రోల్ చేసిన మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్.

మోహన్‌లాల్‌కి కథను నేరేట్ చేశారని, ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకుముందు మోహన్‌లాల్ తమిళ్ సినిమాల్లో చాలా అరుదుగా కనిపించినా, ఈసారి అజిత్‌తో కలిసి పనిచేయడం ఆయన కెరీర్‌లోనూ ప్రత్యేకంగా మారనుంది. ఇప్పటికే ఆయనకు పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అందులో ఒక క్లారిటీ వస్తే త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేషనల్ అవార్డు విన్నింగ్ నటుడిగా మోహన్‌లాల్‌కి భారత సినిమా రంగంలో ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిని అజిత్ సినిమాకు తీసుకుంటే ఇది నిజంగా ఓ క్యాస్టింగ్ బ్లాస్ట్ అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక హీరోయిన్ విషయంలోనూ ఆసక్తికరమైన రూమర్లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ కాంబినేషన్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్. గతంలో గుడ్ బాడ్ అగ్లీ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. అజిత్‌తో మరో భారీ సినిమా తీసేందుకు మైత్రీ ముందుగా రెడీ అవుతుండడం విశేషం. మ్యూజిక్, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.