రే*ప్ కేసు... పరారీలో ప్రముఖ నటుడు?
నటిపై అత్యాచారంకు పాల్పడ్డాడు అనే కేసులో నటుడు అజాజ్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 6 May 2025 10:57 AM ISTనటిపై అత్యాచారంకు పాల్పడ్డాడు అనే కేసులో నటుడు అజాజ్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అజాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అతడి నుంచి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. దాదాపు నాలుగు రోజులుగా అజాజ్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారట. మొదట ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించిన పోలీసులకు అతడు దొరకలేదు. దాంతో విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇప్పటికే అతడికి నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.
పోలీసులు పలు సార్లు అజాజ్ ఖాన్ ఫోన్‌కి చేసినా కూడా ఫలితం లేదట. అతడి ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, పైగా అతడు ఫోన్ ఎక్కడ అయితే ఉందో అక్కడ లేడని తెలుస్తోంది. అతడిని ఏ విధంగా అయినా పట్టుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నటిపై అత్యాచారంకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అజాజ్ ఖాన్ పై మరో కేసు కూడా నమోదు అయింది. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం అతడు చేసిన కంటెంట్ విషయంలోనూ విమర్శలు వస్తున్నాయి. కొందరు ఇప్పటికే ఆ షో నిర్వాహకులపై, ఆ షోకి హోస్ట్ చేస్తున్న అజాజ్ ఖాన్‌పై కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు అజాజ్ ఖాన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు.
రెండు కేసులకు సంబంధించిన పోలీసులు అజాజ్ ఖాన్ కోసం ముంబైను జల్లెడ పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అతడి సన్నిహితుల ద్వారా సమాచారం ఇప్పించే ప్రయత్నం చేశారు. ఫోన్ ద్వారా అందుబాటులో లేక పోవడంతో అజాయ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు దృవీకరిస్తున్నారు. ముంబై పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేసేందుకు గాను కాస్త సీరియస్‌గానే సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అతడికి సంబంధించిన వారిని పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. అతడితో ఈ మధ్య కాలంలో మాట్లాడిన వారి గురించి కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అజాజ్ ఖాన్ ను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఉల్లు యాప్‌లో ప్రసారం అయ్యే హౌస్ అరెస్ట్ అనే కార్యక్రమంలో వచ్చిన కంటెంట్ విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ వివాదంలో చిక్కుకున్న సమయంలోనే రేప్ కేసు కూడా నమోదు కావడంతో సదరు నటుడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు అతడు స్క్రీన్ పై కనిపించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న అజాజ్ ఖాన్ ముందు ముందు జైలు శిక్ష పడితే కెరీర్‌కి గుడ్ బై చెప్పినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
