Begin typing your search above and press return to search.

బ‌యోపిక్ కి మీనింగ్ లా నిలిచేలా ఆ సినిమా!

బాలీవుడ్ లో బ‌యోపిక్ ల‌కు తిరుగులేదు. అక్క‌డి మేక‌ర్స్ తెర‌కెక్కించినంత గొప్ప గా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌లేరు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు

By:  Tupaki Desk   |   10 April 2024 6:57 AM GMT
బ‌యోపిక్ కి మీనింగ్ లా నిలిచేలా ఆ సినిమా!
X

బాలీవుడ్ లో బ‌యోపిక్ ల‌కు తిరుగులేదు. అక్క‌డి మేక‌ర్స్ తెర‌కెక్కించినంత గొప్ప గా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌లేరు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. వాస్త‌వ క‌థ‌లైనా....జీవిత క‌థ‌లైనా నార్త్ మేక‌ర్స్ స్పెష‌లిస్ట్ లు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియాలో బ‌యోపిక్ లు పాపుల‌ర్ అవ్వ‌డానికి కార‌ణం కేవ‌లం అక్క‌డి ద‌ర్శ‌కులే. వీలైనంత వ‌ర‌కూ క‌థ‌లో వాస్త‌వాన్ని చూపించ‌డం...ఎమోష‌న్ హైలైట్ చేయడం అన్న‌ది వాళ్ల‌కే చెల్లింది. తాజాగా అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో `మైదాన్` అనే మ‌రో స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

పుట్ బాల్ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీం క‌థ‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన సినిమా అనివార్య కార‌ణాల‌తో డిలే అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా ద‌ర్శ‌కుడు అమిత్ శ‌ర్మ బ‌యోపిక్ లు ఎలా ఉండాలి? అన్న అంశంపై స్పందించారు. క్రీడా నేప‌థ్యం గ‌ల సినిమాలు తీయాలంటే క‌చ్చితంగా ఈ మూడు నిబంధ‌న‌లు పాటించాలి. `ఆట‌ల‌పై బాగా అవ‌గాహ‌న ఉండాలి. క‌చ్చిత‌మైన బృందాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇందులో ప్ర‌ధానంగా భావోద్వేగాలు పండించ‌గ‌ల‌గాలి.

సినిమా స‌క్సెస్ కిది అత్యంత కీల‌క‌మైన అంశం. ఎలాంటి క‌థ అయినా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేయ‌గ‌ల‌గాలి. ప్ర‌తీ ఒక్క‌రి క‌థ‌లో ఎమోష‌న్ ఉంటుంది. ఆ ఎమోష‌న్ మేక‌ర్ గుర్తించ‌గ‌లగాలి. మైదాన్ లో నేను పుట్ బాల ఆట గురించి చెప్ప‌లేదు. ఆ ఆటో కోసం కోచ్ స‌య్య‌ద్ ఎన్ని త్యాగాలు చేసారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఆ స‌మ‌యంలో ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌య్యారు? ఇలాంటి వాటిని హైలైట్ చేస్తున్నా ఆయ‌న గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో విష‌యాలున్నాయి.

తెలిసిన విష‌యాలు చెప్ప‌డం కంటే తెలియ‌ని విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతాయి. తెలిసిన విష‌యాలు అంతా పేప‌రు..టీవీల్లో చూసే ఉంటారు. నేను మ‌ళ్లీ అదే చెబితే ఉప‌యోగం ఏముంటుంది? క్రియేటివ్ గా నేను ఏం చూపించాను అన్న‌ది ముఖ్యం` అని అన్నారు. అమిత్ శ‌ర్మ తేవార్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మ య్యారు. ఆ త‌ర్వాత `బాదై హో..`ల‌స్ట్ స్టోరీస్-2`..`ట్రైల్ పిరియ‌డ్` చిత్రాలు తెర‌కెక్కించారు. ల‌స్ట్ స్టోరీస్ తో దేశ వ్యాప్తంగా బాగా ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.