స్టార్ హీరో మేనల్లుడు ఫ్లాప్.. కొడుకు సంగతేంటి?
యుగ్ 'ది కరాటే కిడ్: లెజెండ్స్' హిందీ వెర్షన్ కోసం తన తండ్రితో కలిసి పని చేసాడు. ముంబైలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో తండ్రి-కొడుకులు సందడి చేసారు.
By: Tupaki Desk | 15 May 2025 9:00 AM ISTమూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ హీరో అజయ్ దేవగన్ ఇప్పుడు తన 14 ఏళ్ల కుమారుడు యుగ్ ని సినిమా ప్రపంచంలో తొలి అడుగులు వేయడాన్ని సమర్థిస్తున్నాడు. ఇంతకుముందు అజయ్ తన మేనల్లుడు అమన్ దేవగన్ ని వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను సాధించడంలో విఫలమైంది. ఇప్పుడు తనయుడు యుగ్ వంతు.
యుగ్ 'ది కరాటే కిడ్: లెజెండ్స్' హిందీ వెర్షన్ కోసం తన తండ్రితో కలిసి పని చేసాడు. ముంబైలో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో తండ్రి-కొడుకులు సందడి చేసారు. తన తండ్రితో కలిసి పనిచేయడం గురించి, అతడి నుంచి నేర్చుకోవడం గురించి యుగ్ ఈ వేదికపై వెల్లడించాడు. కరాటే కిడ్ కి తన తండ్రితో కలిసి సంభాషణలు ఇచ్చానని వెల్లడించాడు. తన తండ్రి అజయ్ దేవగన్ నటుడిగా గొప్ప ఆదరణ పొందారని చెప్పిన యుగ్ నటనలో తండ్రిని అనుసరిస్తానని తెలిపాడు. జిమ్ లోను దేవగన్ తనకు టిప్స్ ఇస్తాడని యుగ్ వెల్లడించాడు.
'ది కరాటే కిడ్: లెజెండ్స్'లో జాకీ చాన్, రాల్ఫ్ మాచియో - బెన్ వాంగ్ నటించారు. మే 30న భారత దేశంలోని థియేటర్లలోకి రానుంది. హిందీ వెర్షన్‌లో అజయ్ -యుగ్ దేవగన్ ప్రధాన పాత్రలకు గాత్రదానం చేస్తున్నారు. తన కొడుకు అరంగేట్రంపై దేవనగ్ ఎమోషనల్ అయ్యారు. తాను డబ్బింగ్ ప్రక్రియలో పెద్దగా జోక్యం చేసుకోలేదని, యుగ్ బాగా ప్రతిభను కనబరిచాడని స్టూడియో వర్గాలు వెల్లడించినట్టు తెలిపాడు.
