బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియాలో భారీ కాన్సాప్ పై ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 July 2025 6:00 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియాలో భారీ కాన్సాప్ పై ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఇందులో బన్నీ నాలుగు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. సినిమాకు ఇదే పెద్ద హైలైట్ అనుకుంటే? ఇంతకు మించిన సంచలన అంశాలు సినిమాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్లగా ముగ్గురు -నలుగురు నాయికల్ని తీసుకున్నారు. దీపికా పదుకోణే, మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ లాక్ అయ్యారు.
మరో పాత్రకు రష్మిక మందన్నా పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ప్రాజెక్ట్ లో భాగమవుతున్నట్లు వినిపిస్తుంది. ఇందులో అజయ్ ఓ సైకో పాత్ర పోషిస్తున్నాడట. ఈ పాత్ర చాలా క్రూరంగా ఉంటుదట. మనుషుల్ని చంపి తినేసంత ఘోరంగా ఈ రోల్ సినిమాలో హైలైట్ అవుతుందని బాలీవుడ్ మీడియాలో ఓ కథనం పేర్కొంది. ఈ పాత్రకు అజయ్ ని ఎంపిక చేయడం వెనుక అతడిలో యారోగెన్సీ కారణమంటున్నారు. అజయ్ లుక్ ఎప్పుడూ సీరియస్ గా ఉంటుంది.
నవ్వడం చాలా తక్కువ. దీంతో ఆ సైకో పాత్రకు అజయ్ దేవగణ్ వందశాతం సూటవ్వడంతో అట్లీ అతడి తో చర్చించి ఒప్పించినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తేలాలి. ఇప్పటికే అజయ్ దేవగణ్ 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు అజయ్. ఆ పాత్రలో అజయ్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఆ సినిమాతో అజయ్ దేవగణ్ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రాజెక్ట్ లో భాగమవ్వడం ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం అజయ్ దేవగణ్ బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే 'దృశ్యం 3' చిత్రాన్ని కూడా ప్రకటించారు. త్వరలో 'సన్నాఫ్ సర్దార్ 2', 'దేదే ప్యార్ దే 2' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'రేంజర్', 'ధమాల్ -4' చిత్రాలు కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి.
