మైదానంలో మన స్టార్ హీరో శత్రువుతో నవ్వులాటలా?
అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, పాకిస్తానీ క్రికెటర్ అఫ్రిదీతో మైదానంలో హాయిగా నవ్వుతూ ముచ్చట్లాడుతున్న ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి నెటిజనులు అజయ్ ని తిట్టడం ప్రారంభించారు.
By: Tupaki Desk | 22 July 2025 8:29 AM ISTఉగ్రభూతం దేశాల మధ్య, మనుషుల మధ్య ఎలాంటి అగాధాలు తవ్వుతుందో ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు వాటి ఫలితం ఎప్పుడూ దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా దేశంలోని ప్రజల మధ్య సంకుచిత భావజాలాన్ని ఇది వ్యాపించేలా చేస్తుంది. దాయాది పాకిస్తాన్ కి చెందిన ఉగ్రమూకలు పహల్గామ్ ఎటాక్స్ పరిస్థితుల్ని దారుణంగా మార్చింది. ఉగ్రదాడికి సమాధానంగా, భారత్ ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. ఈ యుద్ధం జరుగుతున్నంత సేపు దేశాల మధ్య ప్రజల్లో కలహాలు పెరిగాయి. ఒకరినొకరు ద్వేషించారు.. దూషించుకున్నారు. సోషల్ మీడియాల్లో విద్వేషాగ్నిని వెదజల్లారు. ఇది క్రీడల్లోకి, కళా రంగంలోకి కూడా ప్రవహించింది.
దీని పర్యవసానం కళాకారులు నాశనమయ్యారు. ఇప్పుడు క్రీడాకారులు కూడా నాశనమవుతున్నారు.. భారత్ తో పాక్ కానీ, పాక్ తో భారత్ కానీ క్రికెట్ మ్యాచ్ లు ఆడటానికి వీల్లేదు. రాజకీయంగా ఇది పెను దుమారానికి తెర తీస్తుంది. అంతెందుకు ప్రస్తుతం బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ లీగ్ WCLలో పాకిస్తాన్- భారత్ మ్యాచ్ రద్దయింది.
అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, పాకిస్తానీ క్రికెటర్ అఫ్రిదీతో మైదానంలో హాయిగా నవ్వుతూ ముచ్చట్లాడుతున్న ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి నెటిజనులు అజయ్ ని తిట్టడం ప్రారంభించారు. ఉగ్రదాడి తర్వాత అఫ్రిదీ భారతదేశాన్ని, భారతీయ సైన్యాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అలాంటి శత్రువుతో భారతీయ నటుడు ఇలా నవ్వుతూ మాట్లాడతాడా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఇది గత ఏడాది మ్యాచ్ లోని స్నాప్. పహల్గామ్ దాడి తర్వాత టోర్నీలతో సంబంధం లేనిది. అయినా నెటిజనులు ఈ ఫోటోగ్రాప్‌ని దుర్వినియోగం చేస్తూ, అజయ్ దేవగన్ ని తిట్టడం ప్రారంభించారు. అజయ్ కూడా ప్రస్తుతం జరుగుతున్న WCLకి సహ యజమాని అని తెలిసి కూడా అతడిని ద్వేషించడం విచారకరం.
అజయ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇండియా ఛాంపియన్స్ - పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన WCL 2024 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్ళాడు. కానీ లీగ్ దశ మ్యాచ్ రద్దు అయింది. కానీ రెండు జట్లు అర్హత సాధిస్తే సెమీ-ఫైనల్స్‌లో ఆడేందుకు అవకాశం ఉంది. విచిత్రంగా సంబంధం లేని ఫోటోలతో ఇలా స్టార్లను తిట్టడం అహేతుకం.
