Begin typing your search above and press return to search.

ఆరెక్స్ 100 సీక్వెల్.. హీరోయిన్ ఓకే కానీ..?

సినిమాలో హీరోయిన్ నే విలన్ అది కూడా ఒక టిపికల్ టైప్ క్యారెక్టర్ గా చేసి యువత సూపర్ అనిపించేలా చేసుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో పాయల్ రాజ్ పుత్ సూపర్ పాపులర్ అయ్యింది.

By:  Tupaki Desk   |   23 April 2025 1:30 AM
ఆరెక్స్ 100 సీక్వెల్.. హీరోయిన్ ఓకే కానీ..?
X

అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాతో ఒక కొత్త కథను తెర మీదకు తీసుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. సినిమాలో హీరోయిన్ నే విలన్ అది కూడా ఒక టిపికల్ టైప్ క్యారెక్టర్ గా చేసి యువత సూపర్ అనిపించేలా చేసుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో పాయల్ రాజ్ పుత్ సూపర్ పాపులర్ అయ్యింది.

ఆ సినిమాలో అమ్మడి గ్లామర్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. పాయల్ రాజ్ పుత్ కి ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే వచ్చాయి. కార్తికేయ కూడా ఆరెక్స్ 100 హిట్ తర్వాత కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఐతే అజయ్ భూపతి ఆరెక్స్ 100 సీక్వెల్ ని చేయాలనే ప్లాన్లో ఉన్నాడని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ మంగళవారం సినిమాతో మరోసారి తన మార్క్ చూపించిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా ఉంది.

ఐతే మంగళవారం 2 కథ రెడీ చేసే ప్రయత్నంలో తనకు మొదటి హిట్ ఇచ్చిన ఆరెక్స్ 100 సీక్వెల్ కథ కూడా రాయాలని చూస్తున్నాడట. ఐతే ఆరెక్స్ 100 సీక్వెల్ కథ రాసినా కూడా హీరోయిన్ గా పాయల్ చేసేందుకు ఓకే అనేలా ఉంది కానీ హీరోగా కార్తికేయ మాత్రం నాట్ ఇంట్రెస్ట్ అనేస్తున్నాడట. కార్తికేయకు ఇప్పుడు ఒక ఫాలోయింగ్ ఏర్పడింది. వరుస సినిమాలతో మంచి సక్సెస్ ఫాం లో ఉన్నాడు.

అతను ఇప్పుడు ఆరెక్స్ 100 లాంటి సినిమా చేయడం కష్టం. అందుకే కార్తికేయ, పాయల్ తో మరో కథ చేస్తూ దానికి ఈ సీక్వెల్ టైటిల్ పెట్టినా ఓకే అనేస్తున్నారు ఆడియన్స్. ఐతే ప్రస్తుతం అజయ్ భూపతి మంగళవారం సినిమా సీక్వెల్ కథను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆరెక్స్ 100 సీక్వెల్ చేస్తాడా లేదా మరో కథ తీస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఆరెక్స్ 100 లాంటి సినిమా మరోటి పడితే పాయల్ తిరిగి మళ్లీ ఫాం లోకి వస్తుంది. అందుకే ఆ డైరెక్టర్ ని మాత్రం వదిలి పెట్టకుండా అతను ఎలాంటి ఛాన్స్ ఇచ్చినా ఓకే అనేస్తుంది అమ్మడు.