Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడితో ఐశ్వ‌ర్యారాయ్ షాకింగ్ వీడియో!

అదంతా పాత క‌థే అనుకుంటే, ఇప్పుడు ఐష్‌- వివేక్ ఒబెరాయ్ న‌టించిన ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇంట‌ర్నెట్‌లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   30 March 2024 12:30 AM GMT
మాజీ ప్రియుడితో ఐశ్వ‌ర్యారాయ్ షాకింగ్ వీడియో!
X

ఐశ్వర్య రాయ్ బచ్చన్ - వివేక్ ఒబేరాయ్ మ‌ధ్య స్నేహం, ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఒబేరాయ్ వ‌ల్ల స‌ల్మాన్ ఖాన్ చాలా డిస్ట్ర‌బ్ అయ్యాడు. అత‌డు సాటి హీరో అయిన వివేక్ ఒబేరాయ్ తో డైరెక్టుగా ఫైటింగుకి దిగాడు. ఆ త‌ర్వాత ఒబెరాయ్ కెరీర్ తీవ్ర‌ సందిగ్ధంలో ప‌డింది. అత‌డికి హీరోగా అవ‌కాశాలు త‌గ్గిపోయి చివ‌రికి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాడు. అదంతా పాత క‌థే అనుకుంటే, ఇప్పుడు ఐష్‌- వివేక్ ఒబెరాయ్ న‌టించిన ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇంట‌ర్నెట్‌లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ త్రోబ్యాక్ వీడియో వైర‌ల్ గా షేర్ అవుతోంది.

ఇది శీత‌ల పానీయం గురించిన ప్ర‌క‌ట‌న‌. ఇందులో ఒక‌రినొక‌రు చీట్ చేసుకుంటూ యూత్ ఫుల్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నారు ఐష్‌- ఒబెరాయ్. ఈ జోడీ చాలా యంగ్ ఏజ్ లో ఎంతో స్మార్ట్ గా ప‌ర్ఫెక్ట్ మ్యాచ్ లాగా క‌నిపించార‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాదు.. ఈ వీడియోని స‌ల్మాన్ ఖాన్ కి షేర్ చేస్తామ‌ని కూడా కొంద‌రు అభిమానులు వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ అతడికి 21 సార్లు ఫోన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

స‌ల్మాన్- ఒబేరాయ్ మ‌ధ్య వైరంపైనా తేలిక‌పాటి సెటైర్లు వేస్తున్నారు అభిమానులు. ఇందులో కొన్ని కామెంట్లు ఇలా ఉన్నాయి. స‌ల్మాన్ భాయ్‌కు వ్యతిరేకంగా వివేక్ ఒబెరాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి ముందు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయ‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. ఒక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు, ''ఐశ్వర్యతో సంబంధంలో ఉన్న‌ వివేక్ లేదా సల్మాన్ గురించి ప్రజలు వాదించడాన్ని చూసి అభిషేక్ బ‌చ్చ‌న్ ని ఊహించుకోండి'' అని రాసాడు.

వివేక్ చాలా సార్లు ఐశ్వర్య రాయ్‌తో బ్రేక‌ప్ గురించి, తన చేదు గతం గురించి మాట్లాడాడు. కానీ ఐష్ ఈ ఎఫైర్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఐశ్వర్య రాయ్‌తో తన కుమారుడు వివేక్‌కు ఉన్న సంబంధం గురించి తనకు కూడా తెలియదని, దాని గురించి రామ్ గోపాల్ వర్మ తనకు చెప్పాడని వివేక్ ఒబెరాయ్ తండ్రి లెహ్రెన్ సురేష్ ఒబెరాయ్ తాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ''చాలా విషయాలు నాకు కూడా తెలియవు. వివేక్ నాతో ఎప్పుడూ చెప్పలేదు. రాము (రామ్ గోపాల్ వర్మ) నాతో చెప్పాడు. రాము కంటే ముందు ఎవరో నాకు చెప్పారు. నేను అతడికి అర్థమయ్యేలా చేశాను''అని నిర్మాత సురేష్ ఒబెరాయ్ అన్నారు. అయితే ఈ ఎపిసోడ్స్ లో ఒబెరాయ్ ప‌బ్లిక్ లో ఓపెనైపోయినా ఐశ్వ‌ర్యారాయ్ సైలెంట్ గా ఉండ‌టం గ‌మ‌నార్హం.