Begin typing your search above and press return to search.

మరో సౌత్‌ సినిమాలో ఐశ్వర్య రాయ్‌

తాజాగా ఈ సినిమా కోసం దర్శకుడు మణిరత్నం బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ ని సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2024 12:30 AM GMT
మరో సౌత్‌ సినిమాలో ఐశ్వర్య రాయ్‌
X

యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్‌ త్వరలో ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు కమల్‌ హాసన్‌ లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం తో సినిమా ను చేసేందుకు కమిట్ అవ్వడం, ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలవ్వడం జరిగింది.

కమల్‌ 234వ చిత్రంగా ఈ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమా లో త్రిష మరియు నయనతార హీరోయిన్స్ అనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కోసం దర్శకుడు మణిరత్నం బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ ని సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఐశ్వర్య రాయ్‌ ఈ సినిమా లో నటించేందుకు కథ విన్న వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. థగ్‌ లైఫ్‌ సినిమా లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రాయ్ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందని తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.

కమల్‌ హాసన్‌ చాలా కాలం తర్వాత విక్రమ్‌ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ జోష్ తో మళ్లీ కమల్‌ స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మణిరత్నం సినిమా తో తన అభిమానులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధం అయ్యాడు.

ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాయ్‌ హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే సౌత్‌ లో పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా తో ఐశ్వర్య రాయ్ నటించిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ తమిళ్ మూవీ థగ్ లైఫ్‌ లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.