Begin typing your search above and press return to search.

విడాకుల రూమ‌ర్ల‌కు ఐష్ అలా చెక్

నేడు అభిషేక్ బ‌చ్చ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఐశ్వ‌ర్యారాయ్ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 3:57 AM GMT
విడాకుల రూమ‌ర్ల‌కు ఐష్ అలా చెక్
X

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ దంప‌తుల‌పై కొంత‌కాలంగా ఊహించ‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట క‌ల‌త‌ల‌తో విడిపోయేందుకు సిద్ధ‌మైంద‌నేది ఈ పుకార్ల సారాంశం. అయితే వీటికి ఇంత‌కుముందు అభిషేక్ త‌న‌దైన శైలిలో చెక్ పెట్టాడు. ధీరుభాయ్ అంబానీ స్కూల్ ఈవెంట్లో భార్య‌ ఐశ్వ‌ర్యారాయ్, కుమార్తె ఆరాధ్య బ‌చ్చ‌న్ తో క‌లిసి క‌నిపించాడు. అదే ఈవెంట్లో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఉన్నారు.

అయినా బ‌చ్చ‌న్ కుటుంబ ర‌హ‌స్యాల గురించి ముంబై మీడియా ఎప్పుడూ ఏదో ఒక వంట‌కం వండుతూనే ఉంది. ఇటీవ‌ల ఐష్ త‌న‌ భ‌ర్త నుంచి బ్రేక‌ప్ కి రెడీ అయ్యిందంటూ ముంబై మీడియా ప‌దే ప‌దే కోడై కూస్తోంది. అయితే ఇది నిజ‌మా? అభి-ఐష్ జంట మ‌ధ్య పొర‌పొచ్చాలొచ్చాయా? అంటూ అభిమానులు క‌ల‌త చెందుతున్నారు.

అయితే అన్ని క‌ల‌త‌ల‌కు ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ త‌న‌దైన శైలిలో చెక్ పెట్టారు. భ‌ర్త అంటే త‌న‌కు ఉన్న గౌర‌వం, ప్రేమాభిమానాల‌ను త‌న‌దైన శైలిలో చాటుకున్నారు. నేడు అభిషేక్ బ‌చ్చ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఐశ్వ‌ర్యారాయ్ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిషేక్ చిన్నప్ప‌టి ఫోటోలను షేర్ చేస్తూ.. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసింది.

పుట్టినరోజు నోట్ సారాంశం ఇలా ఉంది. ''ఇక్కడ మీకు చాలా ఆనందం, ప్రేమ, ప్రశాంతత, శాంతి , మంచి ఆరోగ్యంతో ఉండాల‌ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడూ ఆశీర్వదించండి!'' అని రాసారు. మొదటి ఫోటోలో, ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య అంద‌మైన చిరునవ్వుతో సెల్ఫీకి పోజులిచ్చారు. మరొక ఫోటోలో అభిషేక్ చిన్ననాటి ఫోటో ఆక‌ట్టుకున్నాయి.

ఇదేగాక ఇటీవ‌లి ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న భార్య‌పై గొప్ప ప్రేమ‌ను క‌న‌బ‌రిచారు. తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆరాధ్యను అద్భుతంగా పెంచుతున్నార‌ని ప్రశంసించాడు. అతడు తన కుమార్తెను విశ్వానికి కేంద్రం అని కూడా అన్నాడు. ఇదే ఇంటర్వ్యూలో అభిషేక్ తన పుట్టినరోజు వేడుకల గురించి మాట్లాడాడు. ఆరాధ్య కోసం ఈ రోజు ప్రత్యేకంగా మారుతుంద‌ని అభిషేక్ అన్నాడు. నాకు వీలైతే పుట్టినరోజున నా కుటుంబంతో గడపడాన్ని ఇష్టపడతాను. కానీ నేను పని చేయకపోతే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ల‌భించిన‌ట్టు కాదు'' అని అన్నారు. ఆరాధ్య 'మన విశ్వానికి కేంద్రం' ..'అద్భుతమైన బిడ్డ' అని వ్యాఖ్యానించాడు. అద్భుతమైన తల్లిగా ఐశ్వర్య రాయ్‌కు అన్నిర‌కాలుగా క్రెడిట్‌లు ఇచ్చాడు. తండ్రిగా జీవితంపై నా దృక్పథం పూర్తిగా మారింది. పిల్ల‌ల‌ను ఈ ప్రపంచంలోకి తీసుకురావడం మీ ప్రాధాన్యతలన్నింటినీ మారుస్తుంది. దీనిని ప్రతి తల్లిదండ్రులు అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని అన్నారు.

అమితాబ్ బచ్చన్ త‌న కుమారునికి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ''అభిషేక్ .. భయ్యూ.. నువ్వే బెస్ట్ .. నీ వైవిధ్యం, నువ్వు చేసే ప్రతి పనిలో నీ చిత్తశుద్ధి .. ఎప్పటికీ నిష్ఫలంగా ఉండవు .. ఎప్పటికీ !! మై ఎవ‌ర్ లాస్టింగ్ ల‌వ్'' అంటూ ఒక వీడియోను ట్యాగ్ చేశాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అభిషేక్ బచ్చన్ త‌దుప‌రి సినిమా ప్రయాణం వ‌రుస‌ సినిమాల ఆశాజనక లైనప్‌తో కొనసాగుతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గులాబ్ జామూన్ (2024)లో బచ్చన్ తన నటనా నైపుణ్యాన్ని మరోసారి ప్ర‌ద‌ర్శించ‌నున్నాడు. ఈ చిత్రం కశ్యప్ స్థాయిలో విలక్షణమైన కథా శైలితో పాటు, ఆకట్టుకునే కథనంతో అల‌రించ‌నుంది.