Begin typing your search above and press return to search.

పోకిరిని ఉరికించి మ‌రీ త‌న్నిన న‌టి!

ఇంత‌లో ఓ ఆక‌తాయి ప‌నిగ‌ట్టుకుని ఆమె ప్ర‌యివేట్ పార్ట్ తాకి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. అది గ‌మ‌నించిన ఐశ్వ‌ర్య అత‌డిని ప‌ట్టుకుంది. గ‌ట్టిగా అరుస్తూ త‌ప్పుడు ప‌నిచేసిన పోకిరిని చిత‌క‌బాదింది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 12:10 PM GMT
పోకిరిని ఉరికించి మ‌రీ త‌న్నిన న‌టి!
X

ప‌బ్లిక్ లో అప్పుడ‌ప్పుడు హీరోయిన్ల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. అయితే అవి పొర‌పాటున చోటు చేసుకుంటే ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. వాటిని వాళ్లు అంత సీరియ‌స్ గానూ తీసుకోరు. కానీ ప‌నిగ‌ట్టుకుని చేస్తే మాత్రం దేహ శుద్ది త‌ప్ప‌దు. తాజాగా అలాంటి స‌న్నివేశం చెన్నైలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'కెప్లెన్ మిల్ల‌ర్' ఆడియో వేడుక భారీ ఎత్తున అభిమానుల స‌మ‌క్షంలో చెన్నై నెహ్రై స్టేడియంలో జ‌రిగింది.

ఈవెంట్ కి సినిమాకి సంబంధించిన వారంతా హాజ‌ర‌య్యారు. సినిమాలో న‌టి ఐశ్వ‌ర్య ర‌ఘుప‌తి కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈవెంట్ కి ఆమె కూడా హాజ‌రైంది. అయితే ఈవెంట్ లో ఆమెకి ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఈవెంట్ ముగిసిన అనంత‌రం అంతా బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న స‌మ‌యంలో సెల‌బ్రిటీల్ని చుట్టు ముట్టడం స‌హ‌జంగా జ‌రుగుతుంటుంది. అంత‌మంది జ‌నాల్లో కూడా ఎలాగైనా ఓ సెల్పీ తీసుకోవాల‌ని ప్ర‌య‌త్ని స్తుంటారు. అలా ఐశ్వ‌ర్య‌తో ఫోటో కోసం కొంత మంది ప్ర‌య‌త్నించారు.

ఇంత‌లో ఓ ఆక‌తాయి ప‌నిగ‌ట్టుకుని ఆమెని తాకి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. అది గ‌మ‌నించిన ఐశ్వ‌ర్య అత‌డిని ప‌ట్టుకుంది. గ‌ట్టిగా అరుస్తూ త‌ప్పుడు ప‌నిచేసిన పోకిరిని చిత‌క‌బాదింది. ఆమెకు మ‌ద్ద‌తుగా చుట్టూ ఉన్న జ‌నం కూడా స‌హ‌క‌రించ‌డంతోనే ఇది సాద్య‌మైంది. జ‌నాల్ని..బౌన్స‌ర్ల‌ని తోసుకుని ముందుకు పోతున్న పోకిరి వెంట ఆ న‌టి ప‌డి ప‌డి మ‌రీ త‌న్నింది.

దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అంత మంది జ‌నాల్లో కూడా న‌టి ఆక‌తాయిని ప‌ట్టుకుని కొట్ట‌డం ప‌ట్ల నెటి జ‌నులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ధైర్య సాహ‌సాన్ని మెచ్చుకుంటున్నారు. మొహ‌మాటానికో..ఎవ‌రో ఏదో అనుకుంటార‌ని ఆలోచిస్తే? ఇలాంటి ఆక‌తాయిలు మ‌రింత మంది ఎక్కువ అవుతారు. అలా జ‌ర‌గ‌కూడ‌దంటే? ఇలా ప‌బ్లిక్ గానే త‌న్నాలని నెటి జ‌నులు పోస్టులు పెడుతున్నారు.