Begin typing your search above and press return to search.

అందాలు దాచుకోక‌పోతేనే ఛాన్సులొస్తాయ‌న్న న‌టి

తాజాగా ఈ బ్యూటీ వైట్ డివైన్ మెటాలిక్ చీరలో త‌ళుక్కున మెరిసింది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   18 Sep 2023 5:57 AM GMT
అందాలు దాచుకోక‌పోతేనే ఛాన్సులొస్తాయ‌న్న న‌టి
X

న‌టీమ‌ణుల‌ నిరంత‌ర ఫోటోషూట్ల తీరుతెన్నులు మారాయి. మెజారిటీ సౌత్ క‌థానాయిక‌లు బోల్డ్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు ట్రెడిష‌న్ పూర్తిగా మారింది. సోష‌ల్ మీడియాల్లో గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లు హ‌ద్దు మీరుతున్నాయి. హాలీవుడ్ స్టార్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో మ‌న క‌థానాయిక‌లు షాకిస్తున్నారు. అయితే ఇలా చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని అంటున్నారు ఐశ్వ‌ర్య ల‌క్ష్మి. గ్లామ‌ర్ ఎలివేష‌న్ ఈ రోజుల్లో చాలా కీల‌కంగా మారింద‌ని ఐశ్వ‌ర్య ల‌క్ష్మి తాజా ఇంటర్వ్యూలో అన్నారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ - కింగ్ ఆఫ్ కోథా లాంటి చిత్రాల్లో అద్బుత పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న ఐశ్వ‌ర్య ల‌క్ష్మి మునుముందు కెరీర్ లో ఛాలెంజింగ్ పాత్ర‌ల‌ను పోషించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.


ఓవైపు చీర‌లో ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపించినా కానీ, నిరంత‌రం అల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లోను ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ద‌ర్శ‌న‌మిస్తోంది. నిజానికి ఈ మాలీవుడ్ బ్యూటీ ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే కాదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అద్భుతమైన ప్రతిభావ‌ని. ఆమె అసాధారణమైన నటనా నైపుణ్యం త‌న‌కు ఇంతటి పేరును తెచ్చింది. ఐశ్వర్య త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక స్వ‌త‌హాగానే గ్లామ‌ర్ ఎలివేష‌న్ కంటే ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపించేందుకే ఐశ్వ‌ర్య మొగ్గు చూపుతుంది. కానీ ఇటీవ‌ల మారిన ప‌రిస్థితుల దృష్ట్యా రివీలింగ్ దుస్తుల్లో క‌నిపిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డివైన్ మెటాలిక్ చీరలో త‌ళుక్కున మెరిసింది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. సహజమైన ఫ్యాషన్ - సౌందర్యం పై ఐశ్వ‌ర్య ఆస‌క్తిని ఈ శారీ లుక్ ఎలివేట్ చేసింది.

ఫ్యాషన్ నిరంతరం అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఐశ్వర్య లక్ష్మి తెలుపు చీరలో ట్రెడిష‌న‌ల్ లుక్ తో పాటు వైవిధ్యం కోసం ప్ర‌య‌త్నించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

త‌దుప‌రి భారీ ప్ర‌యోగంలో..!

ఐశ్వ‌ర్య న‌టించిన రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ-డ్రామా 'గట్ట కుస్తి' సెప్టెంబర్‌లో వినాయగర్ చతుర్థి సందర్భంగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్, కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. కరుణాస్, మునిష్కాంత్, రెడిన్ కింగ్స్లీ, శ్రీజ రవి, గజరాజ్, నిఖిలా శంకర్, హరీష్ పేరడి, అజయ్, శత్రు, లిజ్జీ ఆంటోని, కళామండలం మల్లిక, మాథ్యూ వర్గీస్, మిప్పు, మాయి సుందర్, మరియు చెల్లా అయ్యావు సహాయక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి రచన -దర్శకత్వం చెల్లా అయ్యవు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. ఎం. నాథన్ ఎడిట‌ర్ కాగా, ప్రసన్న జికె సినిమాటోగ్ర‌ఫీని అందించారు.

'గట్ట కుస్తి' ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఫ్యామిలీస్, పిల్లలకు స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంద‌ని, సీట్ ఎడ్జ్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. పాలక్కాడ్‌లో బోల్డ్ అండ్ డేరింగ్ గాళ్ అయిన గట్ట కుస్తీ ఛాంపియన్ కీర్తి (ఐశ్వర్య లక్ష్మి)తో ఎవ‌రూ పోటీప‌డ‌లేరు. ఇంతలో వీర (విష్ణు విశాల్) అనే పిరికివాడు, అంతగా నేర్చుకోనివాడు.. త‌నకు పొడవాటి జుట్టు ఉన్న భార్య కావాలంటూ వెతుకుతాడు. అలాంటి స్త్రీ తనకు విధేయురాలిగా ఉంటుందని నమ్ముతాడు. కీర్తిలో ఆ ల‌క్ష‌ణాలు క‌నిపెడ‌తాడు. కీర్తిని అత‌డు పెళ్లాడ‌తాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న త‌ర్వాత‌ వీరాకు అస‌లు నిజం తెలుస్తుంది. తన భార్య కుస్తీ చాంపియ‌న్ పైగా తనకంటే ఎక్కువ చదువుకున్నదని, జుట్టు కత్తిరించుకుందని తెలియకుండా దాచింద‌ని తెలుసుకుంటాడు. చివ‌రికి వీరకి నిజం తెలియగానే ఏం జరిగింది? అనేది మిగతా కథాంశం.