Begin typing your search above and press return to search.

బ‌చ్చ‌న్ కూతురితో కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ గొడ‌వేంటి?

బ‌చ్చ‌న్ జీ కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ తో కుమార్తె శ్వేతాబ‌చ్చ‌న్ నందా స‌ఖ్యంగా ఉండ‌ర‌ని చాలా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   6 Oct 2023 10:16 AM GMT
బ‌చ్చ‌న్ కూతురితో కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ గొడ‌వేంటి?
X

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కూతూరికి కోడ‌లికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుందా? అంటే చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలు అవున‌నే క‌థ‌నాలు వండి వారుస్తున్నాయి. బ‌చ్చ‌న్ జీ కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ తో కుమార్తె శ్వేతాబ‌చ్చ‌న్ నందా స‌ఖ్యంగా ఉండ‌ర‌ని చాలా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఆ ఇద్ద‌రూ మాట్లాడుకోరు.. ఎదురుప‌డినా ప‌ల‌క‌రించుకోరు.. అనేది మీడియా క‌థ‌నాల‌ సారాంశం.

బచ్చన్ కుటుంబంలో క‌చ్చితంగా ఏదో మిస్టేక్ జ‌రుగుతోంది! అంటూ ఐష్ వ‌ర్సెస్ శ్వేతా బ‌చ్చ‌న్ గురించి మీడియా క‌థ‌నాలు వేసిన సంద‌ర్భాలున్నాయి. శ్వేతా బచ్చన్ చాలా సార్లు స్ప‌ష్ఠంగా ఐశ్వర్య రాయ్ ను విస్మరించింది.. ఇప్పుడు కూడా ఒక‌ సంద‌ర్భంలో త‌న కుమార్తె నవ్య నవేలిని ప్రశంసించి ఐష్ ని విస్మ‌రించింది. ఒదే వేదిక‌పై ర్యాంప్ వాక్ చేసిన న‌వ్య‌ను ప‌ట్టించుకుని, ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ ని మాత్రం లైట్ తీస్కుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. లేటెస్టుగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ - నవ్య నవేళి నందా ర్యాంప్ వాక్ చేశారు. శ్వేత బచ్చన్ .. కేవ‌లం నవ్య నవేళి గురించి మాత్ర‌మే ప్రస్తావించారు. అయితే ఐశ్వర్య లుక్ లేదా నడక గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.. అంటూ మీడియా కోడై కూస్తోంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ - నవ్య నవేలి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్లు ఎలాన్ అండ్ గ్రేస్‌తో ర్యాంప్‌పై నడిచి భారతదేశం గర్వపడేలా చేసారు. బచ్చన్ వంశానికి చెందిన ఆడ‌ప‌డుచులు ఈ వేదిక‌పై ఎంతో గ్లామరస్‌గా కనిపించారు. ఆ ఇద్ద‌రి అందం దేశాన్ని ఉర్రూతలూగించింది. నవ్యకు మద్దతుగా జయ బచ్చన్ -శ్వేతా బచ్చన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారు ఫోటోలు తీస్తూ ఈవెంట్ ని ఆస్వాధించారు. గ‌ర్వించ‌ద‌గిన మామ్ శ్వేతాబ‌చ్చ‌న్ త‌న కుమార్తె న‌వ్య న‌వేళి గురించి ఏకంగా ఒక పేజీ సుదీర్ఘ‌ నోట్ రాసారు. అయితే ఈ నోట్ లో శ్వేతా బచ్చన్ నందా నవ్య నవేళి గురించి మాత్ర‌మే ఎలా ప్రస్తావించ‌డం ఇత‌రుల‌ను విస్మ‌రించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఐశ్వర్యరాయ్‌ లుక్ లేదా నడక గురించి ఒక్క వాక్యం కూడా లేదు. అదే ఈవెంట్‌లో ఉన్నప్పటికీ బచ్చన్ లేడీస్ అందరూ కలిసి ఉన్న ఫోటోలు మ‌చ్చుకు కూడా లేవు. రచయిత్రి శ్వేత బ‌చ్చ‌న్ నందా ఏం రాశారో ప‌రిశీలిస్తే..

"ఈ వారాంతంలో అన్ని రోడ్లు పారిస్‌కు దారితీశాయి. సరే, కనీసం మా అమ్మకు నాకు..న‌వ్య గురించే ఆలోచ‌న‌లు. న‌వ్య లోరియ‌ల్ గురించి మాత్ర‌మే ఆలోచించింది. ఈవెంట్ వేళ‌ మా అమ్మ, నేను నడుచుకుంటూ తిన్నాము (నిజాయితీగా చెప్పాలంటే రోమింగ్ కంటే ఎక్కువ తినడం).. ఈ ప్రదర్శన ఒక అనుభవం. చాలా ఉద్వేగభరితమైనది - మా చిన్నమ్మాయి నవ్వుతూ ర్యాంప్ పై నడవడంతో కన్నీళ్లను ఆపుకున్నామని మా అమ్మ నేను ఇద్దరూ ఒప్పుకున్నాము!!! అంటూ భావోద్వేగ పోస్ట్ ని శ్వేత‌ రాసింది.

శ్వేతాజీ ఇంకా వ్యాఖ్యానిస్తూ... "న‌వ్య‌ తన మొదటి పుట్టినరోజు జ‌రుపుకుని కొన్ని రోజులే అవుతుందనే విష‌యం నాకు గుర్తుంది - పాత‌కాలం తల్లిదండ్రులందరూ ఇదే చెబుతారు. ఇది చీజీగా చిరాకుగా ఉంది.. కానీ చాలా నిజం. ఆమె(న‌వ్య‌) ఎరుపు రంగులో ఉంది. ఈఫిల్ టవర్ గులాబీ రంగులోకి మారింది. మేము చాలా గర్వంగా.. చాలా భావోద్వేగంతో.. చాలా ఆకలితో ఇంటికి వెళ్ళాము.." అని పోయెటిక్ గా స్పందించారు.

ఐశ్వ‌ర్యారాయ్‌కు శ్వేతా బచ్చన్, నవ్య నంద, జయ బచ్చన్ వంటి అసూయపడే ఆత్మలు అవసరం లేదు! అని ఐష్ అభిమాని ఒక‌రు కామెంట్ చేసారు. ఆమె(శ్వేతా) అలా చేయనందుకు నేను సంతోషిస్తున్నాను.. కానీ వారు ఒకే కార్యక్రమంలో ఉండటం చాలా విచిత్రంగా ఉంది! అని ఒక‌రు రాశారు. నవ్య -ఐష్ దాదాపు 5 నిమిషాల తేడాతో ఒకే షోలో నడిచారని నేను అనుకుంటున్నాను. కాబట్టి జయ-శ్వేత కూడా ఐష్ గురించి ప్ర‌స్థావించి ఉండాలి.. కానీ వారి మ‌ధ్య‌ ఏదో జరిగినట్లు అనిపిస్తోంది. కుటుంబం ఆ సంద‌ర్భంలో చాలా సన్నిహితంగా ఉండాలి క‌దా? అని ఒక నెటిజ‌న్ అభిప్రాయపడ్డారు.

వారు నవ్య కోసం కనిపించినా కానీ, అదే వేదిక వ‌ద్ద‌ వెనక్కి తిరిగి చూడొచ్చు! అని మరొక సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఆ నకిలీ వ్యక్తులతో ఐష్ విసుగు చెందారు. ఇది ఆమెకు మంచిది. విషపూరితమైన వ్యక్తులను మీ జీవితం నుండి తొలగించండి! మరొక‌రు వ్యాఖ్యానించారు. జ‌నం దీన్ని ఎక్కువగా చదువుతున్నారని, ఐశ్వర్యకు ఎవరి మద్దతు అవసరం లేదని అభిప్రాయపడినవారు కూడా చాలా మంది ఉన్నారు. ఐష్ బాధల్లో లేరు. ఆమె సమర్థురాలు. త‌న‌కు ఎవరి మద్దతు అయినా ఎందుకు కావాలి? స్త్రీద్వేషం -సాధికారత ఏమిటో ప్రజలు నిర్ణయించలేరు అని ఒక నెటిజ‌న్ రాశారు. ఐష్‌కి సపోర్ట్ ఇంకా ఏం కావాలి? ఆమె ఇంతకు ముందు లోరియ‌ల్ కోసం ఇలాంటివి వందసార్లు చేసింది. 30 సంవత్సరాలు ఈ బిజినెస్ లో ఉంది. ఇది ఆమెకు కేవలం ఉద్యోగం మాత్రమేనని మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను! అని మరొక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.