Begin typing your search above and press return to search.

ధాంప‌త్య జీవితంలోకి ఐశ్వ‌ర్యా అర్జున్కుం

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె, న‌టి ఐశ్వ‌ర్య వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 9:59 AM GMT
ధాంప‌త్య జీవితంలోకి  ఐశ్వ‌ర్యా అర్జున్కుం
X

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె, న‌టి ఐశ్వ‌ర్య వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కోలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు, ద‌ర్శ‌కుడు తంబిరామ‌య్య కుమారుడు, యువ న‌టుడు ఉమాప‌తితో ఐశ్వ‌ర్య వివాహం జ‌రిగింది. చెన్నైలోని హ‌నుమాన్ ఆల‌యంలోని జ‌రిగిన ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, బంధువుల‌, స‌న్నిహితులు పాల్గొన్నారు. తాజాగా వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


ఐశ్వ‌ర్య‌-ఉమాప‌తి ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌కు చెప్ప‌డంతో పెళ్లికి అంగీక‌రించారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో ఇద్ద‌రి ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. అప్ప‌టి నుంచి వివాహం తేది స‌స్పెన్స్ గా మారింది. ఎంగేజ్ మెంట్ జ‌రిగి ఇన్ని నెల‌లు గ‌డుస్తున్నా? పెళ్లి అవ్వ‌లేదు ఏంటి అని రక‌ర‌కాల కార‌ణాలు తెరపైకి వ‌చ్చాయి. కానీ నిన్న‌టి తో ఇద్ద‌రు ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టి అన్నిర‌కాల సందేహాలకు తెరదించారు.


నూత‌న వ‌ధువ‌రూలు పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్నారు. ఐశ్వ‌ర్య పెళ్లి వ‌స్త్రాల్లో కుంద‌న‌పు బొమ్మ‌లా త‌యారైంది. చీర‌...బంగారు ఆభ‌ర‌ణాలు..చెవుల‌కు ప్ర‌త్యేకంగా బుట్టులు ధ‌రించి ఎంతో అందంగా ముస్తా బైంది. పెళ్లి కోడుకు ఉమాప‌తి కూడా స్మార్ట్ గా ముస్తాబ‌య్యాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.


ఐశ్వ‌ర్య‌ని పెద్ద హీరోయిన్ ని చేయాల‌ని అర్జున్ చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. కానీ ఆమె ఎందుక‌నో ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కాలేదు. అందం..అభిన‌యం...వెనుక మంచి ట్రైనర్ ఉన్నా ఐశ్వ‌ర్య స‌క్సెస్ అవ్వ‌లేదు. న‌టిగా రెండు సినిమాలు చేసి ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. గ‌త ఏడాది టాలీవుడ్ లో కూడా లాంచ్ చేయాల‌ని చూసారు కానీ..ఆ ప్రాజెక్ట్ వివాదాల‌తో ఆగిపోవ‌డంతో ఐశ్వ‌ర్య సినిమా కెరీర్ కి కూడా ముగింపు ప‌డింది.