Begin typing your search above and press return to search.

రజినీతోనే సమస్య అని తేల్చిన కూతురు

ఆయన ఇమేజ్‌కు తగ్గట్లుగా కథను.. సన్నివేశాలను మార్చడం మొదలుపెట్టామని.. దాని వల్ల కథలోని ఎమోషన్ దెబ్బ తిందని సౌందర్య వెల్లడించింది.

By:  Tupaki Desk   |   8 March 2024 4:38 AM GMT
రజినీతోనే సమస్య అని తేల్చిన కూతురు
X

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో ఒక మచ్చలా మారింది 'లాల్ సలాం' సినిమా. రజినీ సినిమాలకు మామూలుగా తొలి రోజు వచ్చే వసూళ్లను కూడా ఈ చిత్రం ఫుల్ రన్లో సాధించలేకపోయింది. రజినీ ఇందులో హీరో కాదు కానీ.. అది ఆయన సినిమాగానే ప్రమోట్ అయింది. ఈ చిత్రంలో ఆయనది 45 నిమిషాలు కనిపించే పాత్ర. కథంగా కూడా చాలా వరకు ఆయన చుట్టూనే తిరుగుతుంది.

అయినా సరే.. రజినీ కోసం ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. రజినీ చిన్న కూతురు సౌందర్యకు కథను ఒక తీరుగా చెప్పడమే రాలేదు. అనేక అంశాలు చెప్పాలనుకుని.. ఒక పద్ధతీ పాడూ లేకుండా కథను నరేట్ చేసి ప్రేక్షకులను అయోమయానికి గురి చేసింది. రజినీ తన వంతుగా ది బెస్ట్ ఇచ్చినా సినిమాను కాపాడలేకపోయాడు. ఐతే సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక పోస్టుమార్టం మొదలుపెట్టిన దర్శకురాలు ఐశ్వర్య.. ఈ సినిమాకు సూపర్ స్టారే ప్రధాన సమస్య అని ఓ ఇంటర్వ్యూలో తేల్చేయడం గమనార్హం.

ముందు 'లాల్ సలాం' కథ అంతా బాగానే ఉందని.. కానీ రజినీ ఇమేజ్ కోసం కొంతమేర స్క్రిప్టును మార్చడం.. అలాగే చివర్లో ఎడిటింగ్‌ చేయడమే సమస్యగా మారిందని ఐశ్వర్య విశ్లేషించింది. రజినీ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కథలోకి వచ్చాక.. 'లాల్ సలాం' స్వరూపం మారిందని ఐశ్వర్య చెప్పింది.

ఆయన ఇమేజ్‌కు తగ్గట్లుగా కథను.. సన్నివేశాలను మార్చడం మొదలుపెట్టామని.. దాని వల్ల కథలోని ఎమోషన్ దెబ్బ తిందని సౌందర్య వెల్లడించింది. ఒరిజినల్ స్క్రిప్టు ప్రకారం ఇంటర్వెల్ వరకు రజినీ పాత్ర కథలోకే రాదని.. కానీ అలా చేస్తే రజినీకోసం థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అసహనానికి గురవుతారన్న ఉద్దేశంతో కథతో పాటు ఎడిటింగ్‌లో కూడా మార్పులు చేసినట్లు ఐశ్వర్య వెల్లడించింది. విడుదలకు రెండు రోజుల ముందు సెకండాఫ్‌లో ఉన్న రజినీ సన్నివేశాలను కొన్ని తీసుకొచ్చి ప్రథమార్ధంలో పెట్టామని.. ద్వితీయార్ధంలో కూడా మార్పులు చేశామని ఆమె తెలిపింది.

ఐతే ఒక్కసారి రజినీ ఎంటరయ్యాక ప్రేక్షకులు ఆయనతోనే ట్రావెల్ అవుతారని.. కథను పట్టించుకోరని.. దాని వల్ల సినిమాలోని వేరే పాత్రలు, సన్నివేశాలు ఎలివేట్ కాలేదని.. అలా 'లాల్ సలాం' గాడి తప్పిందని.. రజినీ ఒక సినిమాలో ఉంటే ఆయనతోనే కథ నడవాలి అన్నది తాను ఈ సినిమా ద్వారా నేర్చుకున్న పాఠమని ఐశ్వర్య అభిప్రాయపడింది. కానీ రజినీ కూతురు చాలా ఆలస్యంగా నేర్చుకున్న పాఠం.. నిర్మాతలు, బయ్యర్లు సహా అందరికీ తీరని నష్టమే మిగిల్చింది.