Begin typing your search above and press return to search.

సంగీత ద‌ర్శ‌కుడిని దూరం పెట్టిన లేడీ డైరెక్ట‌ర్!

అయితే ఏమైందో కానీ, మొద‌టి సినిమా త‌ర్వాత ఆ లేడీ డైరెక్ట‌ర్ తిరిగి అత‌డితో క‌లిసి ప‌ని చేయ‌లేదు. ఒకే ఒక్క సినిమాకి ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:30 AM GMT
సంగీత ద‌ర్శ‌కుడిని దూరం పెట్టిన లేడీ డైరెక్ట‌ర్!
X

ప్ర‌ముఖ లేడీ డైరెక్ట‌ర్ యువ‌సంగీత ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌రిశ్ర‌మ‌లో ఆరంగేట్రం చేసారు. ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాలు ఇప్ప‌టికి మూడు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అవేవీ ఆశించిన ఫ‌లితం ద‌క్కించుకోలేదు. మ‌రోవైపు త‌న‌తో పాటే డెబ్యూగా ప‌రిచ‌య‌మైన‌ యువ సంగీత ద‌ర్శ‌కుడు రికార్డ్ బ్రేకింగ్ చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో సౌతిండియాలోనే సంచ‌ల‌న సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు.

అయితే ఏమైందో కానీ, మొద‌టి సినిమా త‌ర్వాత ఆ లేడీ డైరెక్ట‌ర్ తిరిగి అత‌డితో క‌లిసి ప‌ని చేయ‌లేదు. ఒకే ఒక్క సినిమాకి ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసారు. అత‌డు త‌న‌కు క‌జిన్ అయినా కానీ ఆ లేడీ డైరెక్ట‌ర్ అత‌డికి అవ‌కాశం క‌ల్పించ‌లేదు. పైగా త‌న మూడో చిత్రానికి ఆ లేడీ డైరెక్ట‌ర్ ఏకంగా ఏ.ఆర్.రెహ‌మాన్ ని ఎంపిక చేసుకుంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లేమైనా అయ్యాయా? అందుకే క‌లిసి ప‌ని చేయ‌డం లేదా? అన్న చ‌ర్చా ఇటీవ‌ల అభిమానుల్లో సాగుతోంది.

ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో లేడీ డైరెక్ట‌ర్ ఎవ‌రు? యువ‌సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే... ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్.. త‌న క‌జిన్ అనిరుధ్ ర‌విచంద‌ర్ గురించే ఇదంతా. స‌ద‌రు లేడీ డైరెక్ట‌ర్ గా వ‌రుస చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నా అత‌డికి అవ‌కాశం క‌ల్పించ‌డం లేదు. ఐశ్వ‌ర్య తెర‌కెక్కించిన 3 సినిమాతోనే అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా కెరీర్ ని ప్రారంభించాడు.

ఆ సినిమా పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచినా కానీ సినిమాకి అంత‌గా పేరు రాలేదు. ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే 'లాల్ సలామ్' పేరుతో తన మూడవ చిత్రానికి దర్శకత్వం వహించారు. 9 సంవత్సరాల తర్వాత ద‌ర్శ‌కురాలిగా తిరిగి ప్ర‌య‌త్నించారు. ఐశ్వర్య రజనీకాంత్ 2012లో '3'తో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా స్వరకర్త అనిరుధ్ రవిచందర్‌కు కూడా అరంగేట్ర చిత్రం.

ఐశ్వర్య రజనీకాంత్ తన ఇటీవలి యూట్యూబ్ ఇంటర్వ్యూలో 3 మూవీ ప‌రాజయం.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎంత‌గా డామినేట్ చేసిందో మాట్లాడారు. రొమాంటిక్ డ్రామా '3'ని అనిరుధ్ రవిచందర్ సంగీతం డామినేట్ చేయడంపై ఐశ్వర్య తన ఆందోళనను వ్యక్తం చేసింది. 'వై దిస్ కొలవెరి డి' ప్రమోషనల్ సాంగ్ సినిమా విజయాన్ని ఎలా ఎలివేష‌న్ లేకుండా కప్పివేసిందో వివరించింది.

తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ, గ్లోబల్ హిట్ అయిన 'వై దిస్ కొలవెరి డి' పాట సినిమా విడుదలకు ముందు చిత్రానికి గొప్ప ప్రమోషన్‌గా మారినప్పటికీ, ఈ పాట సినిమా కంటెంట్ ని అధిగ‌మించి ఆధిపత్యం చెలాయించడంతో తాను అసంతృప్తి చెందానని చెప్పింది. సినిమా థియేటర్లలో ప్రదర్శించినప్పుడల్లా లేదా తిరిగి విడుదల చేసినప్పుడు '3' చిత్రానికి వస్తున్న స్పందనను ఐశ్వర్య రజనీకాంత్ వివరించారు.

అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన పాట విజయవంతం కావడంపై తన అసూయను బహిరంగంగా షేర్ చేయ‌డం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అప్పటి నుండి ఆమె తన కజిన్‌తో తిరిగి కలిసి ప‌ని చేయ‌లేదు. త‌న విజ‌యాన్ని అనిరుధ్ పాట త‌న ఖాతాలో వేసుకుంద‌నే అభిప్రాయం ఐశ్వ‌ర్య‌లో అలా ఉండిపోయింది.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా ఇప్పటివరకు మూడు చిత్రాలను అందించారు. తొలి చిత్రం 3 మినహా అనిరుధ్ రవిచందర్ ఏ చిత్రానికి ప‌ని చేయ‌లేదు. ఇటీవల విడుదలైన 'లాల్ సలామ్'కి కూడా ఐశ్వ‌ర్య అవ‌కాశం ఇవ్వ‌లేదు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో న‌టించిన ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫ‌లితం సాధించ‌లేదు. ఇందులో రజనీకాంత్ కీలక పాత్రలో కనిపించ‌గా, ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.