Begin typing your search above and press return to search.

భ‌ర్త‌తో బ్రేక‌ప్ వార్త‌ల‌కు చెక్ పెట్టిన ఐశ్వ‌ర్యారాయ్

అయితే ఇలాంటి పుకార్ల మధ్య ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ ఈరోజు (డిసెంబర్ 15) ముంబైలో జరిగిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో క‌లిసి కనిపించారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:24 PM GMT
భ‌ర్త‌తో బ్రేక‌ప్ వార్త‌ల‌కు చెక్ పెట్టిన ఐశ్వ‌ర్యారాయ్
X

ఐశ్వర్యరాయ్-అభిషేక్ బ‌చ్చ‌న్ జంట విడిపోతున్నార‌ని మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట‌ విడిపోయే అవకాశం ఉందని, భ‌ర్త‌కు దూరంగా ఐష్ త‌న‌ పుట్టింటికి వెళ్లిపోయింద‌ని ఇటీవ‌ల ప‌లు మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. అంతేకాదు.. అత్త మామ‌లు జ‌యాబ‌చ్చ‌న్- అమితాబ్ నుంచి కూడా ప్ర‌స్తుతం నివాసం ఉంటున్న‌ ఇంట్లోనే స‌ప‌రేష‌న్ మెయింటెయిన్ చేస్తోంద‌ని కూడా ఐష్ పై గుస‌గుస‌లు స్ప్రెడ్ అయ్యాయి.

అయితే ఇలాంటి పుకార్ల మధ్య ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ ఈరోజు (డిసెంబర్ 15) ముంబైలో జరిగిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ కార్యక్రమంలో క‌లిసి కనిపించారు. ఆరాధ్య ఇదే స్కూల్ లో చ‌దువుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఈ జంట‌కు సంబంధించిన చాలా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైర‌ల్ అయ్యాయి. ఈ క‌ల‌యికతో విడిపోతున్నార‌నే పుకార్లకు ఈ జంట చెక్ పెట్టారు. ఈవెంట్ వ‌ద్ద‌కు ఐశ్వర్య రాయ్ తన తల్లి బృందారాయ్‌తో కలిసి కారులో వచ్చారు. అభిషేక్ బచ్చన్ తన తండ్రి, నటుడు అమితాబ్ బచ్చన్, మేనల్లుడు అగస్త్య నందాతో క‌లిసి వచ్చారు. తన కారులోంచి బయటికి రాగానే ఐశ్వర్యరాయ్ అభిషేక్ తో క‌లిసి న‌డుస్తూ క‌నిపించింది. అభిషేక్, అగస్త్య నందా, అమితాబ్ ఈ వేదిక వ‌ద్ద‌ ఐశ్వ‌ర్యారాయ్‌తో చేరారు.

నిజానికి స్కూల్ వార్షిక వేడుక‌లో అమితాబ్ బచ్చన్ బృందంతో ముందుకు వెళుతున్నప్పుడు ఐశ్వర్య రాయ్ మామ‌గారితో మాట్లాడ‌టం క‌నిపించింది. అగస్త్య‌ దగ్గరికి వచ్చి తన పక్కన నిలబడ్డప్పుడు ఐష్ అతడి చెంపను ఆప్యాయంగా తాకింది. ఇంతలో అభిషేక్ అక్క‌డ త‌న భార్య‌ ఐశ్వర్య రాయ్‌తో సంభాషించాడు. ఇద్దరూ కలిసి పాఠశాలలోకి ప్రవేశించేప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ చుట్టూ తన చేతిని ఉంచాడు అభిషేక్. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వేదిక వ‌ద్ద‌ నలుపు -బంగారు రంగు సూట్ లో ఐష్ ఎప్ప‌టిలానే స్టైలిష్ గా క‌నిపించ‌గా, అభిషేక్ నేవీ బ్లూ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్ తో క‌నిపించాడు. అమితాబ్ రంగురంగుల జాకెట్ ధ‌రించారు. అగస్త్య నంద తెల్లటి టీ-షర్టుపై లేత గోధుమరంగు జాకెట్ తో వ‌చ్చాడు.

అభిషేక్ - ఐశ్వర్యరాయ్ జంట 20 ఏప్రిల్ 2007లో అమితాబ్ బచ్చన్ బంగ్లా `ప్రతీక్ష`లో సింపుల్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట గురు, ధూమ్ 2, ఉమ్రావ్ జాన్ వంటి చిత్రాలలో క‌లిసి న‌టించారు.16 నవంబర్ 2011న మొదటి బిడ్డ ఆరాధ్యకు స్వాగతం పలికారు. అభిషేక్ ఇటీవలే ఘూమర్‌లో కనిపించాడు. ఒక యువ క్రికెటర్‌కు శిక్షణ ఇచ్చే క్రికెట్ గురువుగా అభిషేక్ నటించాడు. దర్శకుడు మణిరత్నం ఎపిక్ పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ - 2 లో ఐశ్వర్యరాయ్ నటించింది. ఈ పాత్ర‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2023లోను ఐష్ ఆకర్షణీయమైన ప్రదర్శనతో ముఖ్యాంశాల్లో నిలిచింది.