ఆ జర్నీలో ఎన్నో కష్టాలు పడ్డా.. ఆయనకెప్పుడూ ఋణపడి ఉంటా
సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతీ ఒక్కరికీ ఎన్నో కలలుంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతీ ఒక్కరూ స్టార్లుగా రాణించాలనే వస్తారు వారిలో కొందరు తమ టాలెంట్, అదృష్టంతో అనుకున్నవి సాధిస్తే మరికొందరు తమ టార్గెట్ ను రీచ్ అవడానికి ప్రయత్నాస్తూనే ఉంటారు.
By: Tupaki Desk | 29 Nov 2025 1:10 PM ISTసినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతీ ఒక్కరికీ ఎన్నో కలలుంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతీ ఒక్కరూ స్టార్లుగా రాణించాలనే వస్తారు వారిలో కొందరు తమ టాలెంట్, అదృష్టంతో అనుకున్నవి సాధిస్తే మరికొందరు తమ టార్గెట్ ను రీచ్ అవడానికి ప్రయత్నాస్తూనే ఉంటారు. నటులకైతే ఒక్కసారైనా స్టార్లతో కలిసి నటించాలని, డైరెక్టర్లకైతే ఒక్కసారైనా స్టార్ హీరోను డైరెక్ట్ చేయాలని ఆశ పడుతుంటారు.
లాల్ సలాంలో రజినీకాంత్ స్పెషల్ రోల్
అలా ఎందరో సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలని కలలు కంటూ ఉంటారు. రజినీ కూడా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ లాల్ సలాం మూవీ కోసం తన తండ్రిని డైరెక్ట్ చేశారు. లాల్ సలాం మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీలక పాత్రలో నటించగా, రీసెంట్ గా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేశారు.
లాల్ సలాం తీయడమే ఓ ఛాలెంజ్
స్క్రీనింగ్ తర్వాత ఐశ్వర్య మాట్లాడుతూ ఒకింత ఎమోషనల్ అయ్యారు. లాల్ సలాం మూవీ షూటింగ్ డేస్ తనకింకా గుర్తున్నాయని, ఆ ఎక్స్‌పీరియెన్స్ ను మాటల్లో వర్ణించలేనని, ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ జర్నీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, ఆ సినిమాను తీయడమే తనకు ఓ ఛాలెంజ్ లాంటిదని, ఆ టైమ్ లో తన తండ్రి తనకు ఎంతో ధైర్యాన్నిచ్చానన్నారు.
ఆయనకెప్పుడూ ఋణపడి ఉంటా
కూతురిగానే కాకుండా, డైరెక్టర్ గా కూడా ఆయనకెప్పుడూ ఋణపడి ఉంటానని, ఆయన్ను డైరెక్ట్ ఏసే ఛాన్స్ వచ్చినందుకు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా తన కల నెరవేరిందని, లాల్ సలాం జర్నీలో తనకు తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. క్రీడా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా భారీ అంచనాలతో వచ్చిన లాల్ సలాం ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
