Begin typing your search above and press return to search.

సూపర్ హిట్టు వచ్చినా ఆమెను పట్టించుకోరేంటి..?

సూపర్ హిట్ కొట్టాక కూడా అవకాశం రాకపోవడం షాకింగ్ గానే ఉంది. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ్ లో 3 సినిమాలు చేస్తుంది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 5:00 AM IST
సూపర్ హిట్టు వచ్చినా ఆమెను పట్టించుకోరేంటి..?
X

టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది హీరోయిన్స్ కి ఎందుకో పెద్దగా లక్ కలిసి రాలేదు. అయినా సరే వాళ్ల టాలెంట్ తో నెట్టుకొస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు చెన్నై చిన్నది ఐశ్వర్య రాజేష్. తెలుగు మూలాలున్న ఈ భామ తమిళ్ లో పుట్టి పెరగడం వల్ల అక్కడ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినీ నేపథ్యం ఉన్నా కూడా అవకాశాల కోసం కొత్త వాళ్ల లానే కష్టపడింది. తమిళ్ తో పాటు మలయాళ, కన్నడ సినిమాలను చేస్తూ తెలుగు లో వరల్డ్ ఫేమస్ లవర్ చేసింది.

ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఐతే ఐశ్వర్యని చూస్తే కట్టు బొట్టు చక్కని తెలుగు అమ్మాయిలానే ఉంటుంది. అందుకే అమ్మడికి లేట్ అయినా సక్సెస్ వచ్చింది. విక్టరీ వెంకటేష్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అమ్మడు సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ఆడియన్స్ ని ఖుషి చేసింది. ఐతే ఇన్నాళ్లు తెలుగులో సక్సెస్ లేదు కాబట్టి అవకాశాలు రాలేదు అనుకున్నారు కానీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక కూడా అమ్మడికి మరో ఛాన్స్ రాలేదు.

సూపర్ హిట్ కొట్టాక కూడా అవకాశం రాకపోవడం షాకింగ్ గానే ఉంది. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ్ లో 3 సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటితో పాటు అమ్మడు ఓ కన్నడ సినిమా చేస్తుంది. తెలుగులో ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ఉందని ఐశ్వర్య కోరుతున్నా ఆమెకు సరైన ఛాన్స్ లు మాత్రం రావట్లేదు.

ఐశ్వర్య రాజేష్ మాత్రం ఓ పక్క కోలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తూనే తెలుగు నుంచి వచ్చిన ఛాన్స్ లు చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న మెగా 157 లో కూడా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని టాక్ నడుస్తుంది. అదే నిజమైతే మాత్రం ఐశ్వర్య పంట పండినట్టే లెక్క. ఆల్రెడీ చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఐశ్వర్య రాజేష్ చేసినా సెకండ్ హీరోయిన్ గా చేయాల్సిందే. మరి ఆ ఛాన్స్ కూడా ఉందో లేదో త్వరలో తెలుస్తుంది.