వార్‌పై వెంకీ హీరోయిన్ పోస్ట్..నెట్టింట ఏకేస్తున్నారుగా!
ఐశ్వర్యా రాజేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 'యుద్ధానికి నో చెప్పండి. ప్రజాస్వామ్య దేశ సిటిజన్‌గా నేను భారత్, పాక్ దేశాలకు యుద్ధం బదులుగా శాంతిని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
By: Tupaki Desk | 10 May 2025 10:11 AM ISTభారత్ - పాకిస్థాన్‌ల మధ్య రోజు రోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు పెడుతున్న పోస్ట్‌లు వివాదానికి దారి తీస్తున్నాయి. దాయాది దేశం దుర్భుద్దితో ఇండియాపై దాడి చేస్తున్నా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొంత మంది యుద్ధం వద్దు. పాక్‌తో యుద్ధం అసలే వద్దు, ఉగ్రవాదాన్ని ఏరివేయడానికే సైన్యం శిక్షణ తీసుకుంది కానీ వారితో యుద్ధం చేయడానికి కాదు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు.
తాజాగా విక్టరీ వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఇదే తరహాలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అడ్డంగా బుక్కయింది. పాకిస్థాన్ దొంగబుద్ధికి ధీటుగా భారత సైన్యం జవాబు చెబుతూ భీకరంగా పోరాటంచేస్తున్న వేళ యావత్ భారతం అంతా వారి వెంట నడుస్తుంటే హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి పాక్‌తో యుద్ధం వద్దు అని పోస్ట్ చేసి నెటిజన్‌ల ఆగ్రహానికి గురవుతోంది.
ఐశ్వర్యా రాజేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 'యుద్ధానికి నో చెప్పండి. ప్రజాస్వామ్య దేశ సిటిజన్‌గా నేను భారత్, పాక్ దేశాలకు యుద్ధం బదులుగా శాంతిని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందాం. అనవసరమైన ప్రాణనష్టాన్ని నివారించండి. సైనికులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, అమాయక ప్రజలు ఈ యుద్ధఃలో చనిపోకూడదు. ఈ సందేశం అందరికీ చేరనివ్వండి' అంటూ పోస్ట్ చేసింది. ఐశ్వర్యా రాజేష్ పోస్ట్ పెట్టిన ఉద్దేశ్యం శాంతిని కోరుకోవడమే అయినా తను స్పందించిన తీరు మాత్రం నెటిజన్‌లకు, సాటి భారతీయులకు నచ్చడం లేదు.
దీంతో ఐశ్వర్యా రాజేష్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నెట్టింట ఆమెని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్‌తో భారత్ యుద్ధం చేస్తుండటానికి ప్రధాన కారణం సీమాంతర ఉగ్రవాదం. దాన్ని పెంచి పోషిస్తూ ఇటీవల పెహల్గావ్‌లో భారతీయులను వారి భార్యల ముందే ఉగ్రమూకలు కాల్చి చంపడం వల్లే ఈ దుర్ఘటనకు ధీటుగా సమాధానం చెప్పాలనే భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర లాంచ్ ప్యాడ్‌లపై దాడులకు దిగింది. ఈ సంఘటనని కనీసం కోట్ చేయని ఐశ్వర్యా రాజేష్ శాంతి అని, పాక్‌తో యుద్ధం వద్దు అంటూ పోస్ట్ పెట్టడం ఏంటని పలువురు మండిపడుతున్నారు.
అంతే కాకుండా శాంతి ప్రవచనాలు వల్లించే ముందు పాక్ మన దేశాన్ని ఆక్రమించిన విషయాన్ని, మనపై ఉగ్రమూకలతో దాడులు చేయిస్తున్న క్రమాన్ని కూడా ఐశ్వర్య ఎండగడితే బాగుండేదిని, అలాంటి విషయాల్ని పక్కన పెట్టి యుద్ధం వద్దు శాంతే ముద్దు అంటూ సూక్తులు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. దేశం కోసం యావత్ ప్రజలంతా సపోర్ట్‌గా నిలబడిన వేళ సెలబ్రిటీలు ఇలాంటి పోస్ట్‌లు చేయడం విచారకరం. ఇప్పటికైనా భావోద్వేగాలు పతాక స్థాయికి చేరిన ఈ వేళ సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించడం మంచిది.
