ఎటూ తేల్చుకోలేకపోతున్న ఐశ్వర్య
ఇప్పుడు తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది.
By: Tupaki Desk | 11 April 2025 6:00 PM ISTసక్సెస్, ఫెయిల్యూర్ రెండూ ఆర్టిస్టులకు నిద్ర పట్టనీయవు. ఒకవేళ సక్సెస్ వస్తే ఆ సక్సెస్ ను ఎలా నిలుపుకోవాలా అని ఆలోచిస్తూ తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అదే ఫ్లాప్ అయితే తర్వాతి సినిమా అయినా ఇంకా బెటర్ గా ఉండాలని ఆ కోణంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ఆర్టిస్టుని హిట్టూ, ఫ్లాపూ ఊపరాడనీయకుండా చేస్తాయంటారు.
ఇప్పుడు తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. ఐశ్వర్యా రాజేష్ పేరుకే తెలుగమ్మాయి కానీ అమ్మడు తమిళంలోనే బాగా పాపులరైంది. తమిళంలో ఐశ్వర్య రాజేష్ ఎన్నో సినిమాలు చేసింది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో ఐశ్వర్యా రాజేష్ ఈ ఏడాది మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
ఆ సినిమాలో భాగ్యం పాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. వెంకటేష్ తో పోటీ పడి మరీ ఐశ్వర్య ఆ సినిమాలో నటించింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటూ అమ్మడి పాత్రకు కూడా మంచి ప్రశంసలు రావడంతో ఐశ్వర్యకు వరుస ఆఫర్లు వస్తాయని, ఆమె కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పటివరకు ఐశ్వర్య తన నెక్ట్స్ తెలుగు సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేయాలని ఐశ్వర్యా రాజేష్ ఎంతో జాగ్రత్తగా ఉంటూ తర్వాతి సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాస్త లేటైనా సరే మంచి కథ వచ్చే వరకు సినిమాను ఒప్పుకోకూడదని డిసైడింది ఐశ్వర్యా.
ఆల్రెడీ రెండు స్క్రిప్ట్స్ ను పూర్తి చేసిన ఐశ్వర్య ఈ ఏడాది తర్వాత వాటిని అనౌన్స్ చేసే ఛాన్సుంది. తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్ మరియు తీయావర్ కులైగల్ నడుంగ సినిమాలకు కమిట్ అయిన ఐశ్వర్యా ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న కన్నడ సినిమా ఉత్తరాకాండలో కూడా నటిస్తోంది. త్వరలోనే ఐశ్వర్య తన తెలుగు సినిమాను ప్రకటించే అవకాశముంది.
