Begin typing your search above and press return to search.

రెడ్ కార్పెట్ రూలర్ ఎవరు? కేన్స్‌లో మిస్ వరల్డ్ 1994 స్టన్నింగ్ లుక్ వైరల్!

ప్రపంచ ప్రఖ్యాత ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ’లో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మరోసారి తన లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

By:  Madhu Reddy   |   24 May 2026 1:21 PM IST
రెడ్ కార్పెట్ రూలర్ ఎవరు? కేన్స్‌లో మిస్ వరల్డ్ 1994 స్టన్నింగ్ లుక్ వైరల్!
X

ప్రపంచ ప్రఖ్యాత ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ’లో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మరోసారి తన లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్‌పై ఆమె అడుగుపెడితే ఆ హుందాతనమే వేరు. ఈ ఏడాది కూడా ఆమె తన అద్భుతమైన స్టైల్‌తో కేన్స్ వేడుకలను పూర్తిగా తన వశం చేసుకుంది. మిస్ వరల్డ్ 1994 కిరీటాన్ని గెలుచుకున్నప్పటి నుండి నేటివరకు ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెను కొట్టేవాళ్లే లేరని ఈ తాజా లుక్ చూస్తే అర్థమైపోతుంది.

రాయల్ బ్లూ గౌనులో,పింక్ డ్రెస్ లో మెరిసిన ఐశ్వర్య:

ఈ సారి కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్ ఒక మెరిసిపోయే రాయల్ బ్లూ కలర్ మెర్మైడ్ గౌనులో తళుక్కుమంది. ఈ డ్రెస్‌కు ఉన్న ప్రత్యేకమైన డిజైన్, భుజాల దగ్గర ఇచ్చిన డ్రామాటిక్ లుక్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక అంతేకాక ఈ వేడుక కోసం ఆమె ధరించిన బ్లష్ పింక్ కలర్ 'సోఫీ కోచర్' గౌను అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఐశ్వర్య బాడీ షేప్‌కు పక్కాగా సరిపోయేలా చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసిన ఈ డ్రెస్, ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇక పొడవాటి జుట్టును అలా గాల్లోకి వదిలేసి, కెమెరాలకు చేతులూపుతూ ఆమె ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. "కాన్స్ రెడ్ కార్పెట్‌కు అసలైన రాణి ఐశ్వర్యనే" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సినీ ప్రస్థానం.. సూపర్ స్టార్‌డమ్:

ఐశ్వర్య రాయ్ కేవలం ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే కాదు, నటనలోనూ నెంబర్ వన్ అనిపించుకుంది. 1997లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇరువర్'ఇది తెలుగులో ఇద్దరు అనే తమిళ్ సినిమాతో ఈమె కెరీర్ మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, గురు, జోధా అక్బర్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది.

క్రేజీ కంబ్యాక్స్.. అవార్డుల పంట:

తన కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు రెండు ఫిలింఫేర్ అవార్డులను కూడా ఐశ్వర్య సొంతం చేసుకుంది. పెళ్లి, ఫ్యామిలీ కోసం కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. 'యే దిల్ హై ముష్కిల్', అలాగే రీసెంట్‌గా వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సిరీస్‌తో బాక్సాఫీస్ వద్ద పవర్‌ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక నందిని పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఐశ్వర్యను మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంవత్సరాలు మారుతున్నా, కొత్త హీరోయిన్లు వస్తున్నా.. కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఒక సాధారణ మిస్ వరల్డ్ నుండి గ్లోబల్ సినిమా ఐకాన్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం నిజంగా అద్భుతం. రాబోయే రోజుల్లో తన కొత్త సినిమాలతో ఆమె ప్రేక్షకులను ఇంకెంతలా అలరిస్తుందో చూడాలి..