Begin typing your search above and press return to search.

కేన్స్‌లో సింధూర్ ఎలివేష‌న్.. ఐష్ సందేశం అదేనా?

కేన్స్ 2025లో భార‌తీయ ఫ్యాష‌న్ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నారు మ‌న సెల‌బ్రిటీలు. ఇంత‌కుముందు ప్ర‌ముఖ న‌టి రిచీ గుజ్జ‌ర్ రాజ‌స్తానీ చేనేత డిజైన్ ఉన్న‌ చీర‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది

By:  Tupaki Desk   |   21 May 2025 11:21 PM IST
కేన్స్‌లో సింధూర్ ఎలివేష‌న్.. ఐష్ సందేశం అదేనా?
X

కేన్స్ 2025లో భార‌తీయ ఫ్యాష‌న్ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నారు మ‌న సెల‌బ్రిటీలు. ఇంత‌కుముందు ప్ర‌ముఖ న‌టి రిచీ గుజ్జ‌ర్ రాజ‌స్తానీ చేనేత డిజైన్ ఉన్న‌ చీర‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఇప్పుడు ఐవ‌రీ బనారసీ చీరలో రాయల్ ఎలెగెన్స్‌ను ఎలివేట్ చేస్తూ, రెడ్ కార్పెట్‌పై సిందూర్‌ను ప్రదర్శించిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీడియో ఇంట‌ర్నెట్ లో హృద‌యాల‌ను గెలుచుకుంది.

ఫ్రెంచ్ రివేరాలో కొన‌సాగుతున్న‌ 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజ‌రైన‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించారు. 2024లో అభిమానులను నిరాశపరిచింద‌నే విమ‌ర్శ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఐష్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. ఈ సంవత్సరం ఐష్ రారాణిని త‌ల‌పించేలా సొగసైన అవతారంతో అందరినీ ఆకర్షించింది.

51 ఏళ్ల ఐశ్వ‌ర్యారాయ్ కోసం మనీష్ మల్హోత్రా చాలా శ్ర‌మించి ఈ డిజైన‌ర్ శారీని రెడీ చేసారు. ఐష్ ఈ బనారసీ చీరలో తన దేశీగాళ్ లుక్‌ని ప్రదర్శించింది. ఆస‌క్తిక‌రంగా తన సిందూర్‌ను ఐష్ ప్ర‌త్యేకంగా ప్రదర్శించింది. దీని ఉద్ధేశం ఇండియా- పాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సిందూర్ ఆప‌రేష‌న్ ప్ర‌త్యేక‌త‌ను గుర్తు చేయ‌డ‌మేన‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.