ఆయన పక్కనెలా నటిస్తున్నావన్నారు
అలా అని హీరోలకు ఇబ్బందులుండవా అంటే వారిక్కూడా ఎన్నో సమస్యలుంటాయి. కోలీవుడ్ హీరో సూరికి ఇప్పుడలాంటి సమస్య ఎదురైంది.
By: Tupaki Desk | 14 May 2025 8:30 PMసినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు అంటే మొదట గుర్తొచ్చేది హీరోయిన్లే. హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగాలంటే వారెన్నో పరిస్థితుల్ని దాటుకుని మరెన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అని హీరోలకు ఇబ్బందులుండవా అంటే వారిక్కూడా ఎన్నో సమస్యలుంటాయి. కోలీవుడ్ హీరో సూరికి ఇప్పుడలాంటి సమస్య ఎదురైంది.
కమెడియన్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూరి, ఆ తర్వాత విడుదల పార్ట్ 1 సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. విడుదల1 తర్వాత హీరోగా పలు సినిమాలు చేసిన సూరి, వాటితో ఆడియన్స్ నుంచి మంచి ఆదరణే అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా సూరి ప్రధాన పాత్రలో మామన్ అనే సినిమా వస్తోంది.
ఈ సినిమాలో సూరి హీరోగా నటిస్తుండగా అతనికి జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ప్రశాంత్ పడియరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా రీసెంట్ గా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సూరి గురించి ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూరి సర్ తో నేను వర్క్ చేస్తున్నానని తెలిసి నువ్వు అతనితో కలిసి నటించడం కరెక్టేనా అని తనను చాలా మంది అడిగారని, ఈ ప్రశ్న ఎందుకడిగారో తనకు తెలియదని చెప్పిన ఐశ్వర్య లక్ష్మి, తనకు సూరి తో వర్క్ చేయడాన్ని తానెంతో గౌరవంగా భావిస్తున్నానని, ఆయన ఏ సూపర్ స్టార్ ని అయినా తన యాక్టింగ్ తో మ్యాచ్ చేయగలడని చెప్పి, సూరి సర్ మీరు మీతో మళ్లీ మళ్లీ కలిసి వర్క్ చేయాలనుందని చెప్పింది. సూరి కమెడియన్ గా వచ్చి హీరోగా మారడంతో పాటూ అతను హీరో మెటీరియల్ కాకపోవడం వల్లే ఐశ్వర్యను పలువురు ఆ ప్రశ్న అడిగారని అర్థమవుతుంది. ఐశ్వర్య మాటల్ని బట్టి సూరి పక్కన నటించడానికి ఎంతోమంది నో చెప్పారనే విషయం స్పష్టమవుతుంది.