Begin typing your search above and press return to search.

చికాగోలో ఐషా శ‌ర్మ సూప‌ర్ హాట్ సెన్షేష‌న్

గోల్డ్ క‌ల‌ర్ హెయిర్ స్టైల్..డెనిమ్ జీన్స్ నిక్క‌రు..బ్లాక్ డిజైన్ బ్లౌజ్ లో అమ్మ‌డి స్కిన్ టోన్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:16 AM GMT
చికాగోలో ఐషా శ‌ర్మ సూప‌ర్ హాట్ సెన్షేష‌న్
X

ఇన్ స్టా బ్యూటీ ఐశాశ‌ర్మ సూప‌ర్ హాట్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పటికప్పుడు సూపర్ హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. మోడ్ర‌న్ దుస్తుల్లో..చిట్టిపొట్టి నిక్క‌ర్ల‌లో మంట‌లు రేపుతుంది. అమ్మ‌డు ఎలాంటి పిక్ అయినా ఇన్ స్టాకి ఎక్కాల్సిందే. అక్క‌డ ర‌చ్చ జ‌ర‌గాల్సిందే అన్న రేంజ్ లో ఎలివేట్ అవుతుంది. తాజాగా అమ్మ‌డి చికాగా వెకేష‌న్ ఫోటోలు ఇన్ స్టాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి.


గోల్డ్ క‌ల‌ర్ హెయిర్ స్టైల్..డెనిమ్ జీన్స్ నిక్క‌రు..బ్లాక్ డిజైన్ బ్లౌజ్ లో అమ్మ‌డి స్కిన్ టోన్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మ‌త్తెక్కించే చూపులు...పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వు తో ఆక‌ట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం చూస్తుంటే ఇవి చికాగో అడ‌వులు పార్క్ ని త‌ల‌పిస్తుంది. ప్ర‌స్తుతం ఈఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అమ్మ‌డిలో సిస‌లైన నేచుర్ బ్యూటీని నెటి జ‌నులు వ‌ర్ణిస్తున్న తీరు ఆస‌క్తిక‌రం.


సుంద‌రవ‌నంలో ఇది పిల్ల చిరుత దాడిలా ఉందే అంటూ ఓ నెటి జ‌నుడు పోస్ట్ చేసాడు. అలాగే అమ్మ‌డి స్కిన్ టోన్ పై అదే తీరున కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ఇలా నెటి జ‌నుల్ని మ‌త్తెక్కించ‌డంలో ఐశాకి వెన్న‌తో పెట్టిన విద్య‌. న‌టిగా స‌క్సెస్ కాక‌పోయినా ఇన్ స్టా క్వీన్ గా వెలిగిపోతుందంటే? అమ్మ‌డి బ్యూటీనే కార‌ణం. ఫేమ‌స్ అవ్వ‌డానికి సినిమాల్లోనే న‌టించాలా? సోష‌ల్ మీడియాతో ఎంత పాపుల‌ర్ అవ్వొచ్చ‌ని నేటిత‌రం భామ‌లు రుజువు చేస్తున్నారు.


అందులో ఐషా శ‌ర్మ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అలాగని అమ్మ‌డు సినిమా అవ‌కాశాలు లైట్ తీసుకో లేదు. త‌న ప్ర‌య‌త్నాలు తాను సీరియ‌స్ గానే చేస్తోంది. కాక‌పోతే సొగ‌స‌రికి టైమ్ క‌లిసి రావ‌డం లేదు. మ‌రోవైపు సిస్ట‌ర్ నేహాశ‌ర్మ కూడా సిస్ట‌ర్ కోసం ప‌రిచ‌యాల్ని త‌వ్వి తీస్తోంది. కానీ దేనికైనా టైమ్ రావాలి. అప్ప‌టి వ‌ర‌కూ నీరిక్ష‌ణ త‌ప్ప‌దు.