Begin typing your search above and press return to search.

అందాల శర్మ సిస్టర్‌ క్యూట్‌ పిక్స్‌

ఇప్పుడు నేహా శర్మ సిస్టర్‌ ఐషా శర్మ అంతకు మించి అన్నట్లుగా సోషల్‌ మీడియాలో చాలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది

By:  Tupaki Desk   |   26 Jan 2024 5:30 PM GMT
అందాల శర్మ సిస్టర్‌ క్యూట్‌ పిక్స్‌
X

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈ అమ్మడు తెలుగు లో స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అయితే తన సినిమాలు మరియు సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోల కారణంగా చాలా ఫేమస్ అయ్యింది.


ఇప్పుడు నేహా శర్మ సిస్టర్‌ ఐషా శర్మ అంతకు మించి అన్నట్లుగా సోషల్‌ మీడియాలో చాలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక రోజులో తాను గడిపిన మదుర క్షణాలను ఐషా ఇన్‌ స్టా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంది.


అందులోని ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా అందంగా, క్యూట్‌ గా ఉన్న ముద్దుగుమ్మ ఐషా శర్మ అందంకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.


ఇంత అందంగా ఉన్న ఐషా ఇప్పటి వరకు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పడం లేదు. ఈమె కనుక తన వద్దకు వచ్చిన ఆఫర్లకు ఓకే చెప్పడం మొదలు పెడితే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు అయినా ఈమె ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఈ ఫోటోలు చూసిన వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.