Begin typing your search above and press return to search.

ఐషాశ‌ర్మ సిజ్లింగ్ టోన్డ్ బాడీ ఎలివేష‌న్

తాజాగా ఐషా శ‌ర్మ షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోల్లో ఐషా త‌న టోన్డ్ బాడీని ఎంతో అందంగా ప్ర‌ద‌ర్శిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:31 AM GMT
ఐషాశ‌ర్మ సిజ్లింగ్ టోన్డ్ బాడీ ఎలివేష‌న్
X

ముంబై న‌గ‌రంలో శ‌ర్మా గాళ్స్ సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ హాట్ గాళ్స్ క్రౌడ్ పుల్ల‌ర్స్ గా పాపుల‌ర‌య్యారు. శ‌ర్మా సిస్ట‌ర్స్ జిమ్ కి వెళ్లినా లేదా మార్కెట్ ప్లేస్ కి వెళ్లినా.. ఔటింగుల‌కు వెళ్లినా ప‌బ్లిక్ లో బోలెడంత సంద‌డి నెల‌కొంటుంది. హిందీ చిత్ర‌సీమ‌లోని రేర్ ఫ్యాష‌నిస్టాల‌లో శ‌ర్మా సిస్ట‌ర్స్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. స్టైలింగ్ లో ప్ర‌తిసారీ ఏదో ఒక ప్ర‌త్యేక‌త‌ను ఆవిష్క‌రించ‌డం షో స్టాప‌ర్స్ గా నిల‌వ‌డం ఈ భామ‌ల‌కు అల‌వాటు వ్యాప‌కం.


తాజాగా ఐషా శ‌ర్మ షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోల్లో ఐషా త‌న టోన్డ్ బాడీని ఎంతో అందంగా ప్ర‌ద‌ర్శిస్తోంది. సింపుల్ గా గ్రీన్ టాప్ ధ‌రించి, ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తూనే, మేక‌ప్ హంగామా ఏదీ లేకుండా టాన్ తో క‌నిపించింది. ఈ ఫోటోలు ఇలా అంత‌ర్జాలంలోకి రాగానే, అలా జోరుగా వైర‌ల్ అయిపోయాయి. ముఖ్యంగా ఐషా గ్రీన్ టాప్ లో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. అలాగే ప‌క్క‌టెముకలు క‌నిపించేంత‌గా సైజ్ జీరో లుక్ కోసం ఐషా నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది.


సింగిల్ ఆల్బ‌మ్‌ ట్రీట్:


ఐషా శ‌ర్మ ఇంత‌కుముందు జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న స‌త్య‌మేవ జ‌య‌తే అనే భారీ చిత్రంలో న‌టించింది. ఆ సినిమా విజ‌యం సాధించింది. కానీ ఎందుక‌నో ఐషాకు మాత్రం ఆఫ‌ర్లు రాలేదు. ఇప్ప‌టికీ కెరీర్ విష‌యంలో స్ట్రగ్లింగ్ హీరోయిన్ గానే మిగిలి ఉంది. ఇంత‌లోనే ఈ భామ సింగిల్ ఆల్బ‌మ్ లో న‌టిస్తోందంటూ ప్రచార‌మ‌వుతోంది. స‌ల్మాన్ ఖాన్ బావ‌గారైన ఆయుష్ శర్మతో క‌లిసి ఈ సింగిల్ ఆల్బ‌మ్ లో శ‌ర్మా గాళ్ క‌నిపించ‌నుంది.

ఆయుష్- ఐషాల హీట్ పుట్టించే పెర్ఫామెన్సెస్ తో ఈ మ్యూజిక్ వీడియో ఉంటుంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఇటలీ అందాల న‌డుమ ఈ పాట‌ను చిత్రీక‌రించారు. టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ పాట అందరూ కలిసి డ్యాన్స్ చేసే హాట్ పార్టీ నంబర్‌గా ఉంటుందని స‌మాచారం. ఆయుష్ - ఐషా స్క్రీన్‌పై మంట‌లు పెట్ట‌డం ఖాయ‌మ‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. బెంచ్‌మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిర్మాత శాండిల్ డాంగ్ ప్రకారం-"ఆయుష్ - ఐషాల‌ కలయిక మాయాజాలం సృష్టిస్తుంది. ఈ జంట‌ ప్రత్యేకమైన ఆల్బ‌మ్ తో వ‌స్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారీ విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు" అని తెలిపారు. ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.