Begin typing your search above and press return to search.

ఐషా క్లీవేజ్ షో.. కుర్రాళ్లు విలవిల..!

నేహా శర్మ ఆమె సోదరి ఐషా శర్మ ఇద్దరు నేనంటే నేను అని పోటీ పడి మరీ ఆడియన్స్ కి అందాల విందు అందిస్తుంటారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:53 AM GMT
ఐషా క్లీవేజ్ షో.. కుర్రాళ్లు విలవిల..!
X

చిరుత బ్యూటీ నేహా శర్మ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది. సినిమాల పరంగా కెరీర్ అంత ఆశాజనకంగా లేకపోయినా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేస్తూ వస్తుంది అమ్మడు. తెలుగులో చరణ్ సరసన చిరుత, వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమాలో నటించిన నేహా శర్మ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదో లేదా నేహానే కావాలని వద్దనుకుందో కానీ నేహా శర్మ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది.


ఇక బాలీవుడ్ లో కూడా పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. ఏదో నలుగురితో నారాయణా అన్నట్టుగా తన దాకా వచ్చిన సినిమాలను చేస్తూ కెరీర్ సాగించింది అమ్మడు. అయితే సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో మాత్రం నేహా శర్మ అదరగొట్టేస్తుంది. నేహా శర్మ ఆమె సోదరి ఐషా శర్మ ఇద్దరు నేనంటే నేను అని పోటీ పడి మరీ ఆడియన్స్ కి అందాల విందు అందిస్తుంటారు. నేహాకి ఆల్రెడీ సౌత్ సినిమాల అనుభవం వల్ల ఆమె కి తెలుగు ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు.

నేహా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఎక్కువ శాతం టాలీవుడ్ ఆడియన్స్ అని తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక నేహాకి ఈక్వల్ గా ఏమాత్రం తగ్గకుండా ఆమె చెల్లెలు ఐషా శర్మ కూడా గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. ఐషా శర్మ చేస్తున్న ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విడివిడిగా చేస్తూనే ఒక్కోసారి డబుల్ ధమాకాలా నేహా శర్మ, ఐషా శర్మ ఇద్దరు కలిసి గ్లామర్ ట్రీట్ అందిస్తారు. ఫ్రీ టికెట్ తో రెండు ఆటలు అన్నట్టుగా సోషల్ మీడియాలో వీరి స్కిన్ షోకి మంచి డిమాండ్ ఏర్పడింది.

సోషల్ మీడియా ఫాలోయింగ్ ద్వారానే శర్మ సిస్టర్స్ తమ మెయింటైనెన్స్ మొత్తం లాగించేస్తున్నారు అనుకుంటా అందుకే కావాలని పనికట్టుకుని గ్లామర్ షో చేస్తుంటారు. లేటెస్ట్ గా నేహా శర్మ ఇన్ స్టా పేజ్ లో నేహాతో పాటుగా ఐషా కూడా రెచ్చిపోయింది. గ్లామర్ డోస్ పెంచుతూ ఈసారి క్లీవేజ్ షోతో ఫాలోవర్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది ఐషా శర్మ. ప్రస్తుతం ఐశా శర్మ ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శర్మ సిస్టర్స్ చేస్తున్న ఈ ఫోటో షూట్స్ హంగామా వాళ్లకి మంచి మైలేజ్ ఇస్తున్నాయని చెప్పొచ్చు.