యూనిఫాం నుంచి గ్లామర్ వరకూ.. ఎయిర్‌హోస్టెస్‌లుగా చేసి హీరోయిన్ గా గుర్తింపు..
ఆకాశంలో విమానాల్లో ప్రయాణికులకు సేవలు అందించే ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలేసి, వెండితెరపై హీరోయిన్లుగా మెరిసిపోవడం అంటే మామూలు విషయం కాదు.
By: Madhu Reddy | 17 Jun 2026 12:16 PM ISTఆకాశంలో విమానాల్లో ప్రయాణికులకు సేవలు అందించే ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలేసి, వెండితెరపై హీరోయిన్లుగా మెరిసిపోవడం అంటే మామూలు విషయం కాదు. తాజాగా వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రాశీ సింగ్ ఎయిర్‌హోస్టెస్ స్టైల్‌లో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. నటి కాకముందు ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారు. ఆమెలాగే గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన మరికొందరు ముద్దుగుమ్మల క్రేజీ జర్నీ మీకోసం..
ఎయిర్‌హోస్టెస్ టు హీరోయిన్.. రాశీ సింగ్:
రాయ్‌పూర్‌కు చెందిన రాశీ సింగ్ నటి అవ్వకముందు ప్రముఖ ‘ఇండిగో’ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత 2019లో 'జెమ్' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తాజాగా జరిగిన తన కొత్త సినిమా ఈవెంట్‌లో ఆమె ఎయిర్‌హోస్టెస్ స్టైల్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తూ స్పీచ్ ఇచ్చి అందరిని అలరించారు.
కింగ్‌ఫిషర్ నుంచి టాలీవుడ్ దాకా.. వాణీ భోజన్:
సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వాణీ భోజన్ కూడా ఒకప్పుడు ఎయిర్‌హోస్టెస్‌గా చేశారు. ఆమె ‘కింగ్‌ఫిషర్’, ‘ఇండిగో’ లాంటి టాప్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఆ జాబ్ వదిలేసి మోడలింగ్‌లోకి వచ్చారు. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో పాటు తమిళంలో ‘ఓ మై కడవులే’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
షారుఖ్ ఖాన్ మూవీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన విద్యా మాల్వాడే, సినిమాల్లోకి రాకముందు ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారు. తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టారు. షారుక్ నటించిన చక్ దే ఇండియా హాకీ టీమ్ కెప్టెన్‌గా నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు.
పంజాబీ ఇండస్ట్రీ క్వీన్.. సోనమ్ బజ్వా:
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సోనమ్ బజ్వా కూడా మొదట్లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసి హీరోయిన్‌గా మారారు. పంజాబీ సినీ ఇండస్ట్రీలో ‘పంజాబ్ ఎల్ఓఎల్’, ‘అర్దబ్ ముతియారన్’ వంటి సినిమాలతో టాప్ స్టార్‌గా ఎదిగారు. టాలీవుడ్‌లో కూడా ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిశారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి స్టార్ హీరోయిన్‌గా.. తాప్సీ పన్ను:
వీరంతా ఎయిర్‌హోస్టెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే.. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉండేవారు. చదువు పూర్తి కాగానే ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించారు. కానీ ప్యాషన్ కోసం ఆ జాబ్ వదిలేసి మోడలింగ్, ఆపై సినిమాల్లోకి వచ్చారు. తెలుగులో ‘ఝుమ్మంది నాదం’తో కెరీర్ స్టార్ట్ చేసి, బాలీవుడ్‌లో ‘పింక్’, ‘థప్పడ్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
ఒక వైపు ఎయిర్‌హోస్టెస్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల లాంటి ప్రొఫెషనల్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. తమ మనసుకు నచ్చిన గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఈ భామలు అద్భుతాలు సృష్టించారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడితే ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించవచ్చని ఈ హీరోయిన్లు నిరూపించారు.
