మన స్టార్స్ సామన్యులుగా మారితే ఎలా ఉంటుంది?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి దిగిన దగ్గరి నుంచి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులుచోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 11:34 AM ISTఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి దిగిన దగ్గరి నుంచి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులుచోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప`, పుష్ప 2` ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా బన్నీ పోషించిన పుష్పరాజ్ క్యారెక్టర్ వైరల్ గా మారింది. చిన్న పెద్దా అని తేడా లేకుండా అంతా ఈ క్యారెక్టర్‌కు ఫిదా అయిపోయారు. అనుకరించడం మొదలు పెట్టారు. రీల్స్ చేశారు. అయితే ముందు ఈ క్యారెక్టర్ కోసం మహేష్‌ని అనుకున్న విషయం తెలిసిందే.
మహేష్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఓ అభిమాని విడుదల చేసిన ఏఐ వీడియో ఇటీవల నెట్టింట వైరల్‌గా మారడం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో మరో ఏఐ వీడియో తాజాగా బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. మన టాలీవుడ్ స్టార్స్ సామాన్యులుగా మారి వివిధ పనులు చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆయా పనులు చేస్తూ మన హీరోలు ఎలా ఉంటారు? అనే ఊహతో ఓ అభిమాని స్పెషల్ ఏఐ వీడియోని రూపొందించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
కొన్ని సందర్భాల్లో ఫేక్ వీడియోలతో కలవారాన్ని కలిగిస్తున్న ఏఐ వీడియోలు మరి కొన్ని సందర్భాల్లో మాత్రం అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన వీడియోలో మన టాలీవుడ్ క్రేజీ స్టార్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సామన్యులుగా మారిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జొమాటో డెలివరీ బాయ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జ్యూస్ బాయ్‌గా మారిపోయాడు.
ఇక ప్రభాస్ కబాబ్స్ రెడీ చేసే వ్యక్తిగా కనిపించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోడ్రైవర్‌గా ఖాకీ డ్రెస్‌లో కనిపించడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇక నేచురల్ స్టార్ నాని మాత్రం టీ సెల్లర్‌గా కనిపించి బిగ్ బాస్ సీజన్ ని గుర్తు చేశాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మటన్ కొడుతూ అమ్మే వ్యక్తిగా కనిపించడంతో ఫ్యాన్స్ అరే..భలే ఉందే అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
