Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌..ఆ పెద్ద సినిమాకి AI వ‌ర‌మా? శాప‌మా?

సరిగ్గా ఈ ఆర్జీవీ లేదా అమీర్ పేట‌(హైద‌రాబాద్)లోని ఏఐ కోచ్ చెప్పిన ప్ర‌కార‌మే.. ఇప్పుడు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉద్యోగాల‌కు కోత ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

By:  Sivaji Kontham   |   21 Sept 2026 8:00 PM IST
#గుస‌గుస‌..ఆ పెద్ద సినిమాకి AI వ‌ర‌మా? శాప‌మా?
X

''కొద్దిరోజులు ఆగండి.. సినిమా మొత్తం AIలోనే తీసేస్తారు. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో ఎవ‌రికీ పెద్ద‌గా ప‌ని ఉండ‌దు!'' అని వాస్త‌వ ప‌రిస్థితిని చెప్పారు ఆర్జీవీ. కృత్రిమ మేథస్సు (ఏఐ) ఆరంభ‌మే వినోద రంగం నుంచి ఉద్యోగాల‌న్నిటినీ తొల‌గిస్తుంద‌ని కూడా విశ్లేషించారు. ఆ త‌ర్వాత అమీర్ పేట‌లోని ప్ర‌ముఖ ఏఐ కోచింగ్ సెంట‌ర్ అన‌లిస్టులు కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్- ఎడిటింగ్- సంగీతం- ఛాయాగ్ర‌హ‌ణం స‌హా 24 శాఖ‌ల‌కు చెందిన చాలా ఉద్యోగాల‌కు కోత ప‌డేందుకు ఏఐ కార‌ణం కాబోతోంద‌ని.. దానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని కూడా విశ్లేషించారు.

సరిగ్గా ఈ ఆర్జీవీ లేదా అమీర్ పేట‌(హైద‌రాబాద్)లోని ఏఐ కోచ్ చెప్పిన ప్ర‌కార‌మే.. ఇప్పుడు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉద్యోగాల‌కు కోత ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక ఉదాహ‌ర‌ణ‌గా చూస్తే.. ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్న ఓ భారీ చిత్రం విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ పై బోలెడంత డైల‌మా కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది. నిజానికి ఈరోజుల్లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్ర‌తిదీ చేసేస్తోంది. దీనిని ఉప‌యోగించుకుని వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ చేయ‌డం కూడా అంత క‌ష్ట‌మేమీ కాదు. దీంతో ఏఐ ని ఉప‌యోగించకుండా నిపుణులు రోజుల త‌ర‌బ‌డి చేసిన వ‌ర్క్ పై మేక‌ర్స్ కి డైల‌మా స‌న్నివేశం ఎదుర‌వుతోంద‌ట‌. నిజ‌మైన వీఎఫ్ఎక్స్ నిపుణులు చేసిన విజువ‌ల్స్ ని ఉంచాలా? లేక కృత్రిమ మేధ‌స్సు సాయంతో చేసిన వీఎఫ్ఎక్స్ ప‌నిని ఉప‌యోగించుకోవాలా? అనే డైల‌మా మేక‌ర్స్ లో కొన‌సాగుతోంద‌ట‌. అయితే కృత్రిమ మేధ‌స్సు తో త‌యారైన విజువ‌ల్స్ పై కొన్ని విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా.. ఈ మార్గాన్ని అనుస‌రించాలా వ‌ద్దా? లేక ఒరిజిన‌ల్ నిపుణుల‌తో క‌లిసి ప‌ని చేయాలా? అనే డైల‌మా కూడా ఇబ్బందిక‌రంగా మారింద‌ట‌.

సినిమాకి సంబంధించిన అన్ని ప‌నులు నిజానికి ఒప్ప‌టికే పూర్త‌య్యాయి. కేవ‌లం వీఎఫ్ఎక్స్ ఔట్ పుట్ ని ది బెస్ట్ గా తీసుకోవాల‌నే ప‌ట్టుద‌ల కార‌ణంగానే రిలీజ్ ని వాయిదా వేస్తున్నార‌ని స‌మాచారం. అయితే అన్ని డైల‌మాల్ని క్లియ‌ర్ చేసుకున్న త‌ర్వాతే వీరంతా ఒక నిర్ణ‌యానికి వ‌స్తార‌ని కూడా భావిస్తున్నారు. ఇప్ప‌టికే పాట‌ల చిత్రీక‌ర‌ణ‌, నేప‌థ్య సంగీతం స‌హా స‌మ‌స్త‌ప‌నులు పూర్త‌యినా కానీ వీఎఫ్ఎక్స్ పెండింగ్ ఉండ‌టంతోనే రిలీజ్ డేట్ చెప్ప‌డం లేద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

అయితే మేక‌ర్స్ ఎలాంటి రిస్కులు లేకుండా నిజ‌మైన నిపుణుల సాయంతోనే వీఎఫ్ఎక్స్ ప‌నుల్ని పూర్తి చేయించాల‌ని.. అవి వంద‌శాతం ప‌రిపూర్ణ‌త‌తో ఆక‌ట్టుకుంటాయ‌ని, ఇంకా ఆరంభ ద‌శ‌లో ఉన్న ఏఐని న‌మ్మాల్సిన ప‌ని లేద‌ని కూడా కొంద‌రు సూచిస్తున్నారు. పెద్ద తెర‌పై ఏఐ క్రియేటెడ్ వీఎఫ్ఎక్స్ ఆశించిన స్థాయిలో క‌నిపించ‌క‌పోతే దాని ఫ‌లితం మొత్తం సినిమాపై ప‌డుతుంద‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. అయితే ఇంట‌ర్నెట్ లో ఏఐ బేస్డ్ విజువ‌ల్స్ తో క్రియేట్ చేసిన చాలా సినిమాలు గొప్ప నాణ్య‌మైన వ‌ర్క్ తో ఆక‌ర్షిస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం నాశిర‌కం ప‌ని త‌నంతో తేలిపోయాయి. అందుకే ఇప్ప‌టికీ ఇంకా పూర్తి స్థాయిలో ఏఐపై ఆధార‌ప‌డి సినిమాలు తీయ‌డం స‌రికాద‌నే అభిప్రాయం ఉంది.

పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియను వేగంగా సులువుగా మారుస్తుందని ఆశించిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఈ చిత్ర బృందానికి మరో పెద్ద తలనొప్పిని, సమస్యను సృష్టించినట్లు కనిపిస్తోంది. అయితే మేక‌ర్స్ ముందే దీనిపై పూర్తి క్లారిటీతో లేక‌పోతే అది మ‌రింత పెద్ద స‌మ‌స్య‌ను తెచ్చి పెడుతుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. త్వ‌ర‌గా డైల‌మాను క్లియ‌ర్ చేసుకుని ఈ సినిమాని క‌నీసం వ‌చ్చే సంక్రాంతికి అయినా థియేట‌ర్ల‌లోకి తీసుకు వస్తే మంచిద‌నే సూచ‌న‌లు కూడా కొంద‌రి నుంచి విన‌వ‌స్తున్నాయి.