ఏఐ సహాయంతో నాగచైతన్య లుక్ డిజైన్!
ఏఐ సాంకేతిక సినిమాల్లో విరివిగా వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఏఐ ఇన్నోవేషన్ ఇండస్ట్రీకి ప్పుడు ఖర్చుతో పాటు ఎంతో సమయాన్ని కూడా ఆదా చేస్తోంది
By: Tupaki Desk | 17 May 2025 12:37 PM ISTఏఐ సాంకేతిక సినిమాల్లో విరివిగా వినియోగంలో ఉన్న సంగతి తెలిసిందే. ఏఐ ఇన్నోవేషన్ ఇండస్ట్రీకి ప్పుడు ఖర్చుతో పాటు ఎంతో సమయాన్ని కూడా ఆదా చేస్తోంది. దీంతో దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఏఐ వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. తాజాగా నాగచైతన్య 24వ చిత్రం లుక్ డిజైన్ విషయంలో ఏఐ సహాయం తీసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించన్నాడు.
ఆ లుక్ ఎలా ఉండాలన్నది ఓవైపు మనుషులు పని చేస్తున్నారు. కానీ మరింత పర్పెక్షన్ ఉండాలని ఏఐ సహాయం కూడా తీసుకుంటున్నారు. సినిమాలో చైతన్య పాత్ర పేరు అర్జున్. నిధి అన్వేషణలో మొనగాడు ఎలా ఉంటాడు? అన్నది హైలైట్ అవ్వాలి. లుక్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. నిధి అన్వేషణలో ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. హీరోల గెటప్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా కొత్తగా ఉండాలి.
దీనికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసారు. లుక్ కోసం చాలా కసరత్తులు చేసాం. `ఏ ఐ` సహాయంతో ఓ కొత్త లుక్ డిసైడ్ అయింది. `తండేల్` .. ఇప్పుడీ కథలే ఇలా కొత్త ప్రయత్నాలు చేయడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి సినిమాల ద్వారా సాహసం చేస్తున్న భావన ఎప్పుడు కలగలేదు. సాహసం అంటే దాన్ని బరువుగా ఫీలవుతాం. కానీ నాకు ఈ ప్రయత్నం చాలా సహజంగా అనిపిస్తుంది.
సినిమా లో బ్రహ్మగిరి సెట్ మూడు దశల్లో ఉంటుంది. ఆ సెట్ కోసం 50 రోజులు పనిచేసారని తెలిపారు. మొత్తానికి హీరోల లుక్ విషయలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారిందని తెలుస్తోంది. ఒకప్పుడు హీరో లుక్ ఎలా ఉండాలి? అనేది కేవలం దర్శకుడు మాత్రమే డిసైడ్ చేసేవాడు. పాత్రను రాసిన అతడి విజన్ లోనే హీరో కనిపించేవాడు. కానీ ఏఐ వచ్చిన తర్వాత వాళ్లు కూడా మైండ్ వర్క్ తగ్గించినట్లు కనిపిస్తుంది.
