ఇండస్ట్రీలో ఎవరెవరు ఏఐ నేర్చుకోవాలి?
ఇక రైటర్లు స్టోరీ చర్చల్లో కొత్త ఐడియాల కోసం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, రీసెర్చ్ కోసం తప్పక తెలుసుకోవాలి.
By: Srikanth Kontham | 22 Feb 2026 8:00 PM ISTఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ప్రభావం సినిమాలపై ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఏఐ తెలియకుండా డైరెక్టర్ అయితే? కష్టమిక. ఆ టెక్నాలజీ నేర్చుకున్న తర్వాతే అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ప్రత్యేకించి టెక్నికల్ అంశాలతో సినిమాలు తీసే ప్రతీ దర్శకుడు ఈ సాంకేతికతను తెలుసుకోవాల్సిందే. ఇంతకీ చిత్ర పరిశ్రమంలో ఏఐ టెక్నాలజీని ఎవరెవరు తెలుసుకోవాలి? సినిమా నిర్మాణంలో ప్రతీ భాగం ఏఐతో ముడిపడి ఉంది. దర్శకులు షూటింగ్ మొదలుపెట్టకముందే సినిమా ఎలా ఉంటుందో చూసేందుకు ప్రీ విజువలైజేషన్ కోసం నేర్చుకోవాల్సిందే.
ఇక రైటర్లు స్టోరీ చర్చల్లో కొత్త ఐడియాల కోసం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, రీసెర్చ్ కోసం తప్పక తెలుసుకోవాలి. ఎడిటర్లు అనవసరమైన ఫుటేజ్ తొలగించడం, ఆటో మేటిక్ కట్స్ , కలర్ గ్రేడింగ్ కోసం విరివిగా వినియోగించే అవకాశం ఉంటుంది. అలాగే సినిమాటోగ్రాఫర్లు అయితే లైటింగ్ సిమ్యులేషన్, కెమెరా యాంగిల్స్ ప్లాన్ చేయడం కోసం ఏఐని వినియోగించుకోవచ్చు. విఎఫ్ ఎక్స్ యానిమేషన్ చేసేవారు నెలల తరబడి చేసే పనిని రోజుల్లోనే ఏఐతో పూర్తి చేయోచ్చు. ఇక నిర్మాతలైతే బడ్జెట్ మేనేజ్మెంట్, బాక్సాఫీస్ ప్రిడిక్షన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీల కోసం ఏఐతో తెలుసుకోవచ్చు.
ప్రముఖంగా ఏఐని ఎవరికి అత్యవసరం అంటే? విఎఫ్ ఎక్స్ అండ్ సీజీఐ కోసం గతంలో వందల మంది పనిచేసేవారు. ఇప్పుడా పని ఏఐ ఒక్కటే చేసేస్తోంది. డీ-ఏజింగ్ (వయస్సు తగ్గించడం), ఫేస్ స్వాపింగ్ ఇప్పుడు చాలా సులభం గా మారింది. వండర్ స్టూడియో, లూమా ఏఐ వంటి వాటిని ఎడిటర్లు రఫ్ కట్ చేయడం కోసం వినియోగిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ నాయిస్ తీసేయడం, కలర్ మ్యాచ్ చేయడం వంటి పనులు ఏఐ సెకన్లలో చేస్తోంది. దర్శకుల ఆలోచనను బొమ్మగా గీయడానికి గతంలో గంటలు సమయం పట్టేది.
ఇప్పుడు ఏఐతో నిమిషాల్లో మూడ్ బోర్డ్ సిద్ధం చేయొచ్చు. ఒక భాషలో చెప్పిన డైలాగులను వేరే భాషలోకి అదే గొంతుతో (వాయిస్ క్లోనింగ్) మార్చడానికి ఏఐ తప్పనిసరి గా మారింది. ఏఐని చలన చిత్ర రంగంలో తెలివిగా వినియోగించుకోగల్గితే? మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. విశ్వ నటుడు కమల్ హాసన్ ఇప్పటికే విదేశాల్లో ఏఐ నేర్చుకున్న సంగతి తెలిసిందే. కమల్ ఎక్కువగా టెక్నికల్ నేపథ్యంతో కూడిన కథల పట్ల ఆసక్తిగా ఉంటారు. కొంత మంది బాలీవుడ్ నటులు కూడా ఏపై పరిజ్ఞానం సంపాదించారు. ఈ విషయంలో టాలీవుడ్ నటులే వెనుకంజలో ఉన్నారు
