ఇండస్ట్రీలో ఏఐపై ప్రయోగాలు
మూవీ వరల్డ్ లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగ దశ దాటుకుని ప్రొడక్షన్ స్టేజ్ కు వచ్చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 23 Aug 2025 9:00 PM ISTమూవీ వరల్డ్ లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగ దశ దాటుకుని ప్రొడక్షన్ స్టేజ్ కు వచ్చేసింది. మేకర్ల టాలెంట్ కు సవాల్ చేస్తూ ఏఐ దూసుకెళ్తుంది. విదేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా ఏఐ సినిమా పరుగులు పెడుతోంది. దీని వల్ల ఖర్చుకు ఖర్చు, టైమ్ కు టైమ్ సేవ్ అవడంతో అందరూ దీనిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.
ఊహించని మ్యాజిక్ చేసిన మహావతార్ నరసింహ
బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల హవా నడుస్తున్న టైమ్ లో స్టార్లతో పన్లేకుండా, యానిమేషన్ లో ఏఐ సాయంతో క్యారెక్టర్లను క్రియేట్ చేసి సినిమాలు చేయాలని పలువురు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అలా వచ్చిన మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ గా నిలిచి కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు మిగిలిన దర్శకనిర్మాతలు కూడా ఆ దిశగా అడుగులేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఏఐ సాయంతో వర్క్ లోడ్ ను తగ్గించుకుంటున్న మేకర్లు
కొందరు కేవలం ఏఐ బేస్డ్ సినిమాలపైనే తమ ఫోకస్ మొత్తాన్ని పెడితే, మరికొందరు మాత్రం తాము తీసే సినిమాలకు ఏఐ సాయంతో పనిని తగ్గించుకోవాలని చూస్తున్నారట. డైరెక్టర్లు, రైటర్లు, యాక్టర్లు అందరూ ఎప్పటిలానే ఉంటారు. కాకపోతే ఎక్కువ శ్రమ పడకుండా యానిమేషన్, విఎఫ్ఎక్స్ కు ఏఐని వాడుకునేలా ప్లాన్లు చేస్తున్నారు. వీటివల్ల మనుషుల క్రియేటివిటీ దెబ్బ తినే అవకాశమున్నా అందరూ ఏఐకు పెద్ద పీట వేస్తున్నారు.
అయితే సినిమాల్లో ఏఐ వాడకంలో మనమూ ముందే ఉన్నాం. రీసెంట్ గా వచ్చిన మహావతార్ సినిమాలో ఏఐ టూల్స్ వాడకం బాగానే జరిగింది. ఆ మధ్య వచ్చిన బ్రహ్మాస్త్ర లో కూడా ఏఐను వాడారు. కల్కిలో ఫ్యూచర్ వరల్డ్ ను చూపించడానికి డిజిటల్ టూల్స్ సృష్టించిన వాతావరణమే ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇలా మరెన్నో సినిమాలు ఏఐ దారిలో నడుస్తున్నాయి.
ఇప్పుడు మహావతార్ బాక్సాఫీస్ వద్ద చేసిన మ్యాజిక్ ను చూసి కన్నడ నుంచి మరో సినిమా లవ్ యూ అనే టైటిల్ తో వరల్డ్ లోనే ఫస్ట్ ఫుల్ లెంగ్త్ ఏఐ ఫిల్మ్ గా రాబోతుంది. దీంతో పాటూ మహారాజా ఇన్ డెనిమ్స్ అనే సినిమా కూడా దేశంలో మొదటి ఏఐ ఫీచర్ ఫిల్మ్ గా అనౌన్స్ చేసుకుంది. అయితే ఏఐ వల్ల ఎన్నో లాభాలున్నప్పటికీ అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఏఐను మంచి కంటే చెడుకే ఎక్కువ వాడుతున్నారు ప్రజలు. తక్కువ ఖర్చు, ఫాస్ట్ గా పూర్తవడం కాకుండా కొన్ని విషయలను అధిగమించే విషయంలో ఏఐ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఏఐ సాయంతో లేనివి ఉన్నట్టుగా చూపించడం కూడా ఆడియన్స్ కు నచ్చడం లేదు. అన్నింటికీ మించి అసలు నిజమేదో గ్రాఫిక్స్ ఏదో తెలియని స్థాయికి ఏఐ మనల్ని తీసుకొచ్చింది. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ విమర్శలు తగ్గే అవకాశముంది.
