Begin typing your search above and press return to search.

ఆప్ష‌న్స్ ఉన్నా క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్న హీరో!

త‌దుప‌రి కూడా పాన్ ఇండియా సినిమానే చేయాలి కాబ‌ట్టి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   24 March 2024 4:30 PM GMT
ఆప్ష‌న్స్ ఉన్నా క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్న హీరో!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాట్ నెక్స్ట్ అన్న దానిపై క‌న్య్పూజ‌న్ లో ప‌డ్డాడా? ఏ డైరెక్ట‌ర్ తో ముందుకెళ్ల‌లో అర్దం కాక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప‌-2 తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన చిత్రాన్ని ఆగ‌స్ట్ 15కి వాయిదా వేసారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ అయిపోతుంది. ఆ త‌ర్వాత ఆరు నెల‌లు పాటు బ‌న్నీ విరామం తీసుకుంటాడు. త‌దుప‌రి కూడా పాన్ ఇండియా సినిమానే చేయాలి కాబ‌ట్టి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.


కానీ ఆ డైరెక్ట‌ర్ విష‌యంలో బ‌న్నీ క‌న్ప్యూజ‌న్ కి గుర‌వుతున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడా స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. త్రివిక్రమ్ చేసే సినిమా పాన్ ఇండియా చిత్ర‌మైనా? `పుష్ప` స‌క్సెస్ అనంత‌రం గురూజీ తో పాన్ ఇండియా సినిమా క‌రెక్టేనా? అన్న సందేహం వెంటాడుతుంది. అటు అట్లీ కూడా బ‌న్నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంత‌కాలం ఇది ప్ర‌చారం అనుకున్నా! అట్లీ భార్య ట్వీట్ తో ఆ కాంబినేష‌న్ దాదాపు సెట్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది.

అట్లీతో పాన్ ఇండియా సినిమా అంటే స‌క్సెస్ కి ఎక్కువ‌గా ఉన్నాయి. ఇంత‌వ‌ర‌కూ అట్లీకి ఫెయిల్యూర్ లేదు. పైగా ఇటీవ‌లే `జ‌వాన్` తో షారుక్ ఖాన్ కే పాన్ ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. అలాంట‌ప్పుడు అట్లీని వ‌దిలేస్తే ఎలా ? అన్న ఆలోచ‌నా అంతే సీరియస్ గా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు గీతా ఆర్స్ట్ లో బోయ‌పాటి శ్రీను తో ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌నొచ్చింది. అదీ బ‌న్నీతోనా? మ‌రో హీరోతోనా? అన్న‌ది తెలియ‌దు. కానీ బోయ‌పాటి బ‌న్నీ అనే ఆశ‌లోనే ఉన్నాడు.

అలాగ‌ని బోయ‌పాటిని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. `అఖండ` విజ‌యంతో పాన్ ఇండియా లో అత‌డి పేరు మారుమ్రోగింది. ఆ త‌ర్వాత వైఫ‌ల్యాలున్న‌ప్ప‌టికీ బ‌న్నీని వంద కోట్ల క్ల‌బ్ లో చేర్చింది బోయపాటి అన్న విష‌యం గుర్తించాలి. `స‌రైనోడు` విజ‌యంతో అది సాధ్య‌మైంది. ఇలా బ‌న్నీ ముందు ముగ్గురు ద‌ర్శ‌కులు ఆప్ష‌న్స్ గా క‌నిపిస్తున్నారు. కానీ ఎవ‌ర్ని ఎంపిక చేయాలో అర్దం కానీ స‌న్నివేశం ఉంది.