తండ్రిని ఇమ్మిటేట్ చేస్తున్న యంగ్ హీరో
బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా దశాబ్ధాల పాటు కొనసాగాడు సునీల్ శెట్టి. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ తో పోటీపడుతూ నటించాడు.
By: Tupaki Desk | 7 July 2025 10:00 AM ISTబాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా దశాబ్ధాల పాటు కొనసాగాడు సునీల్ శెట్టి. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ తో పోటీపడుతూ నటించాడు. కానీ కాలక్రమంలో శెట్టి హవా తగ్గింది. అతడు నటనను విరమించి ఇతర వ్యాపార మార్గాల్లో ప్రయాణించాడు. అయితే అతడు కొంత గ్యాప్ తీసుకుని తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ లో అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నాడు.
ఇంతలోనే ఇప్పుడు సునీల్ శెట్టి సహా పలువురు దిగ్గజాలు నటించిన బార్డర్ చిత్రానికి సీక్వెల్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 1997 బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యుద్ధభూమిలో మరణించే వీరుడైన భారాన్ సింగ్ పాత్రలో సునీల్ శెట్టి నటించారు. కానీ ఇప్పుడు సీక్వెల్ లో సునీల్ స్థానంలో అతడి కుమారుడు అహన్ శెట్టి సైనికుడిగా కనిపించనుండడం అభిమానుల్లో ఉత్సుకతను పెంచింది. ఇప్పుడు లీకైన ఆన్ లొకేషన్ ఫోటోగ్రాఫ్స్ లో అహన్ సైనికుడి యూనిఫాంలో అచ్చుగుద్దినట్టు తన తండ్రిని తలపించడాన్ని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. కల్ట్ క్లాసిక్‌లోని తన పాత్ర అయిన కెప్టెన్ భైరాన్ సింగ్‌గా సునీల్ రూపాన్ని, అతడి కుమారుడు అహన్ గెటప్ ను కలిపి షేర్ చేస్తూ, జనం ఆ ఇద్దరికీ పోలిక చెబుతున్నారు. ''హర్ బేటా కహిన్ నా కహిన్ అప్నే బాప్ జైసా బన్నా చాహ్తా హై.. బోర్డర్ 2 చిత్రం 23 జనవరి 2026న రిలీజవుతుంది! అంటూ తేదీని కూడా చెప్పేసారు.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించిన 'బోర్డర్' సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సీక్వెల్ తెరకెక్కుతోంది. జె.పి. దత్తా దర్శకత్వం వహించిన క్లాసిక్ కి సీక్వెల్ లో నేటితరం నటులు వరుణ్ ధావన్, అహన్ శెట్టి , దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ సినిమాలోని సన్నీ డియోల్ తిరిగి సీక్వెల్ లోను కనిపిస్తున్నాడు. అయితే సునీల్ శెట్టి పాత్ర చనిపోతుంది గనుక అది ఇప్పుడు తిరిగి రాదు. కానీ సునీల్ శెట్టి వారసుడు సీక్వెల్ లో కనిపించనుండడం ఆసక్తిని పెంచుతోంది. తన వారసుడు భైరాన్ సింగ్ పాత్రతో తిరిగి రావడంపై సునీల్ కొంత ఉద్వేగంగానే స్పందిస్తున్నాడు. అహన్ తన తండ్రి సునీల్ శెట్టికి ఇప్పటికే ప్రామిస్ చేసాడు. ఈ పాత్రతో డాడీ గౌరవాన్ని పెంచుతానని. ఇప్పుడు అభిమానులు షేర్ చేస్తున్న పోస్టర్లలో అచ్చు గుద్దినట్టు సునీల్ ని తలపిస్తున్నాడు. సునీల్ శెట్టి చివరిసారిగా కేసరి వీర్‌లో కనిపించాడు. ఆయన కుమారుడు అహన్ శెట్టి `తడప్`తో తెరంగేట్రం చేశాడు.
