సోదరుడితో అనన్య పాండే అదిరిపోయే డ్యాన్స్
ఈ వీడియో చూశాక అహాన్ లో బాలీవుడ్ హీరో అయ్యే సత్తా ఉందని నాకు తెలుసు. చంకీ పాండే పాటలో అహాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 24 July 2025 5:00 AM IST`సైయారా` సినిమాతో అనన్య పాండే కజిన్ అహాన్ పాండే పేరు మార్మోగిపోతోంది. హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ `కహోనా ప్యార్ హై`ని మించి వసూళ్లు సాధిస్తోంది సైయారా. అహాన్ పాండే- అనీతా పద్దా జంట అద్భుతమైన కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన అస్సెట్ అన్న ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అహాన్ పాండేపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడి ఫోటోలు, వీడియోలు వైరల్ గా షేర్ అవుతున్నాయి.
అతడిని అందరూ ఓవర్ నైట్ స్టార్ అని ప్రశంసిస్తున్నారు. అనన్యకు సోదరుడు, చంకీ పాండే తమ్ముడు చింకీ పాండే కుమారుడు అయిన అహాన్ పాండే అద్భుత నటన, డ్యాన్సింగ్ నైపుణ్యం గురించి కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా తన కజిన్ అనన్య పాండేతో కలిసి అహాన్ డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అహాన్ ఎనర్జిటిగ్గా డ్యాన్సులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేసిన క్వీన్ ఆఫ్ గాసిప్ ఎఫ్.బి లో అహాన్ పై ప్రశంసలు కురిపించడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ వీడియో చూశాక అహాన్ లో బాలీవుడ్ హీరో అయ్యే సత్తా ఉందని నాకు తెలుసు. చంకీ పాండే పాటలో అహాన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. తన సోదరి అలానా వివాహవేడుకలో మరో సోదరి అనన్య పాండేతో కలిసి అహాన్ డ్యాన్స్ అద్భుతంగా చేస్తున్నాడు. వారిది చాలా ఆరోగ్యకరమైన కుటుంబం.. అనన్య పాండే చీరలో చాలా అందంగా ఉంది. ఇద్దరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో రాసారు.
