Begin typing your search above and press return to search.

సోద‌రుడిని బ‌రిలో దించేసిన లైగ‌ర్ బ్యూటీ

అనన్య పాండే కజిన్ అహాన్ పాండే మోహిత్ సూరి తెర‌కెక్కిస్తున్న‌ ప్రేమకథా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు

By:  Tupaki Desk   |   8 Feb 2024 7:30 AM GMT
సోద‌రుడిని బ‌రిలో దించేసిన లైగ‌ర్ బ్యూటీ
X

అవును.. లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే త‌న సోద‌రుడిని బ‌రిలో దించుతోంది. చాలా మంది న‌ట‌వార‌సుల త‌ర‌హాలోనే ఇప్పుడు అన‌న్య సోద‌రుడు అహాన్ వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. అందం చందంలో ఏ టాప్ హీరోకి త‌గ్గ‌ని ఈ యువ‌కుడు ఏ మేర‌కు రాణిస్తాడు? అన్న‌ది అటుంచితే ఇప్పుడు మ‌రోసారి అన‌న్య పాండే హెడ్ లైన్స్ లోకొస్తోంది.


అనన్య పాండే కజిన్ అహాన్ పాండే మోహిత్ సూరి తెర‌కెక్కిస్తున్న‌ ప్రేమకథా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. దీనిని యష్ రాజ్ ఫిల్మ్స్ స‌మ‌ర్పిస్తోంది. తాజా క‌థ‌నాల‌ ప్రకారం, అహాన్ 5 సంవత్సరాల నుండి హీరోగా తెరంగేట్ర‌ ప్రాజెక్ట్ కోసం ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

ఐదేళ్ల క్రితం YRF టాలెంట్ ఏజెన్సీ తో సంతకం చేసిన అహాన్ ఆదిత్య చోప్రా మార్గదర్శకత్వంలో విస్తృతమైన శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ట్రేడ్ ప్రకారం .. ఆహాన్‌ని ఆదిత్య చోప్రా వ్యక్తిగతంగా సంవత్సరాలుగా తీర్చిదిద్దారు. అతడు తన క్రాఫ్ట్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టడానికి YRF లో అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. పరిశ్రమకు అహాన్ పాండే లాంచ్ అతి పెద్ద అరంగేట్రంయ కానుంద‌ని స‌మాచారం. YRF అతడిని ఒక స్టార్ గా మ‌లిచే ప్ర‌య‌త్నాల్లో ఉంది. అతడు సైన్ చేసిన భారీ ప్రాజెక్ట్ కి మోహిత్ సూరి లాంటి ప్ర‌తిభావంతుడు తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. పైగా ఇది ప్రేమకథా చిత్రం కావ‌డంతో యూత్ లో అంచ‌నాలేర్ప‌డుతున్నాయి.

అహాన్ మోహిత్ పర్యవేక్షణలో పనిచేశాడు. ఆడిషన్స్ స‌హా ప‌లుమార్లు స్క్రీన్ టెస్ట్‌లతో మోహిత్ అతడిని నిలబెట్టాడు! మోహిత్ పెద్ద తెరపై హీరోగా నిలదొక్కుకునే చరిష్మా కలిగి ఉన్న ఒక ఫ్రెష్, యువకుడిని కోరుకున్నాడు. అహాన్ సామర్థ్యంపై అత‌డికి న‌మ్మ‌కం ఉంది. అందుకే ఎంపిక చేసుకున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

అహాన్ పాండే ఎవరు?

అహాన్ అనన్య పాండే కజిన్ .. చుంకీ సోదరుడైన‌ చిక్కి పాండే - డీన్నే పాండేల కుమారుడు. ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ దర్శకుడు ఐవోర్ మెక్‌క్రేని వివాహం చేసుకున్న అలనా పాండే అహాన్ కి సోదరి. అహాన్ త‌న‌ బాలీవుడ్ అరంగేట్రం కంటే ముందు ది రైల్వే మెన్, ఫ్రీకీ అలీ, రాక్ ఆన్ 2 వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ (AD)గా పనిచేశాడు.