కబీర్ సింగ్ ను గుర్తుచేస్తున్న సైయారా
బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'సైయారా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం వైపునకు దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 20 July 2025 3:00 PM ISTబాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'సైయారా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం వైపునకు దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 18న రిలీజైన ఈ సినిమా, ఓపెనింగ్ రోజు పెద్దగా వసూళ్లు సాధించలేదు. అయితే మౌత్ టాక్ వల్ల వీకెండ్ అయిన శనివారం పుంజుకుంది. రెండో రోజు ఆక్యుపెన్సీ పెరిగింది. దీంతో మల్టీప్లెక్స్ లు ఫుల్ అవుకున్నాయి.
తొలి రోజుతో పోలిస్తే, రెండో రోజు కలెక్షన్లు 15- 20 శాతం పెరిగిటన్లు తెలుస్తోంది. దీంతో శనివారం రోజే రూ.24 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓపెనింగ్ డే కు రెండో రోజుకు స్పందన పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ. దీంతో ఓవరాల్ గా సినిమాకు స్పందన పెరగడంతో థియేటర్ల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ తోపాటు నార్త్ లో యూపీ, బీహార్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అయిత ఓపెనింగ్ రోజు కూడా డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ, యూపీ సర్క్యూట్ లలో సైయారా కు విశేష ఆదరణ దక్కుతోంది. అక్కడ ఇది బ్లాక్ బస్టర్ సినిమాలు ఛావా, సికిందర్, హౌస్ ఫుల్ 3 చిత్రాలను దాటేసింది. దీంతో నార్త్ లో ఈ సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.
అయితే ఇదంతా చూస్తుంటే గతంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కబీర్ సింగ్ ట్రెండ్ ను సైయారా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. కబీర్ సింగ్ ఏ సర్టిఫికేట్ సినిమా కావడంతో కొన్ని పరిమితులతోనే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత హిట్ టాక్ తో మెల్లిగా పికప్ అయ్యింది. అలా కబీర్ సింగ్ భారీ విజయం దక్కించుకుంది.
ఇప్పుడు సైయారా విషయంలోనూ ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఓపెనింగ్ డే అంతంత మాత్రం ఉన్న కలెక్షన్లు, రెండో రోజు పెరిగాయి. ఇక మూడోరోజు ఆదివారం కావడంతో వసూళ్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. పైగా కబీర్ సింగ్ ఏ సర్టిఫికెట్, కానీ సైయారా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకర్షిస్తుంది. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగితే సైయారా 2025లో బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ పండింతులు చెబుతున్న మాట!
