డేటింగుల్లో స్పీడున్నోడు 'సైయారా' కుర్రాడు
మరోవైపు అహాన్ పాండే బాలీవుడ్ సూపర్ స్టార్ సుహానా ఖాన్ తో గతంలో డేట్ చేసాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 27 July 2025 6:00 AM ISTబాలీవుడ్ లో నేపో కిడ్స్ గురించి చాలా ఎక్కువ చర్చ సాగుతోంది. నేపోకిడ్స్ కి నటన రాదని, అభినయం అంటే ఏమిటో తెలీదని, సిల్వర్ స్పూన్ కిడ్స్ కి కనీసం కష్టం అంటే ఏమిటో కూడా తెలీదని విమర్శలొస్తున్నాయి. కనీసం మునుపటి తరం స్టార్ల తరహాలో అయినా హార్డ్ వర్క్ చేసేందుకు నేటితరం స్టార్ కిడ్స్ సిద్ధంగా లేరు. కానీ ఈ విమర్శలన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఒక నేపో కిడ్ బాలీవుడ్ లో ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్ అందుకోవడం, అంతకుమించి నటుడిగా పేరు తెచ్చుకోవడం హాట్ టాపిగ్గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు చంకీ పాండే సోదరుడు చింకీ పాండే కుమారుడు అహాన్ పాండే అనూహ్యంగా ఓవర్ నైట్ స్టార్‌గా ఆవిర్భవించాడు.
మోహిత్ సూరి రొమాంటిక్ లవ్ స్టోరి `సైయారా`లో అహాన్ పాండే కథానాయకుడిగా నటించాడు. ఇదే చిత్రంతో అనీత్ పద్దా కథానాయికగా పరిచయమైంది. కొత్త జంటకు నటన పరంగా గొప్ప గుర్తింపు, గౌరవం దక్కింది. ఇప్పుడు ఫోకస్ అంతా అహాన్ పైనే.. అదే సమయంలో యువహీరో డేటింగ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే కుతూహాలం అభిమానుల్లో మొదలైంది.
అహాన్ పాండే సైయారా హీరోయిన్ అనీత్ పద్దాతో ప్రేమలో ఉన్నాడని ఇటీవల కథనాలొచ్చాయి. ఈ జంట ఔటింగుల గురించి గుసగుసలు వినిపించాయి. యువజంట `సైయారా` ప్రచార వేదికలపై ఎంతో సన్నిహితంగా కనిపించడంతో కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోందని కామెంట్లు వినిపించాయి. ఇంతలోనే అహాన్ పాండేని పిచ్చిగా ప్రేమించే మరో అందమైన అమ్మాయి వెబ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అహాన్ గతంలో శ్రుతి చౌహాన్ అనే ట్యాలెంటెడ్ మోడల్ కం నటితో డేట్ చేసాడు. శ్రుతి `గల్లీబోయ్` చిత్రంలో మాయ అనే కీలక పాత్రలో నటించింది. ముంబైలో టాప్ మోడల్ గాను రాణించింది. అయితే అహాన్ పాండే సైయారా చిత్రంతో బ్లాక బస్టర్ కొట్టడంతో శ్రుతి చౌహాన్ తన ఎమోషన్ ని దాచుకోలేకపోయింది. ఏదో ఒక రోజు ఈ లోకానికి నువ్వేంటో తెలుస్తుంది.. అది ఈరోజే! అంటూ శ్రుతి ఎమోషనల్ అయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఏడుస్తున్నాను.. కేరింతలు కొడుతున్నాను... ! అంటూ అహాన్ సక్సెస్ గురించి ప్రస్థావిస్తూ ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాల్లో `లవ్ యు` అని కూడా అతడిపై తన ప్రేమను కురిపించింది. దీంతో ఈ జంట నడుమ డేటింగ్ వ్యవహారం నడుస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి.
మరోవైపు అహాన్ పాండే బాలీవుడ్ సూపర్ స్టార్ సుహానా ఖాన్ తో గతంలో డేట్ చేసాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సుహానాతో కలిసి అహాన్ ఇంతకుముందు మూవీ డేట్ కి వెళ్లాడు. థియేటర్ వద్ద జంటగా కనిపించగా, వారిపై కెమెరా ఫ్లాష్ లు మెరిసాయి. అయితే కెమెరా కళ్ల నుంచి తప్పించుకునేందుకు ఈ జంట విశ్వప్రయత్నం చేసిందని కూడా కథనాలొచ్చాయి. నిజానికి సుహానా ఖాన్ కి అనన్యాపాండే, అహాన్ పాండేలతో గొప్ప స్నేహం ఉంది. వారంతా పార్టీల్లో నిరంతరం కనిపిస్తూనే ఉన్నారు. కానీ మూవీ డేట్ లో సుహానా అహాన్ సన్నిహితంగా మెలగడంతో పుకార్లు మొదలయ్యాయి.
అందాల కథానాయిక తారా సుతారియాతోను అహాన్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడని గతంలో పుకార్లు వచ్చాయి. కానీ దీనిని ఇరువురిలో ఎవరూ ధృవీకరించలేదు. అయితే ఈ ఇద్దరూ టీనేజ్‌లో ఉన్నప్పుడు.. షోబిజ్ ప్రపంచంతో సంబంధం లేనప్పుడు కొంతకాలం డేటింగ్ చేశారని గుసగుసలు వినిపించాయి. అయితే బాలీవుడ్‌లో ఎవరైనా జంటగా కనిపిస్తే గాసిప్పులు సులువుగా పుట్టుకొచ్చేస్తాయి. పైవన్నీ పుకార్లు మాత్రమే..! వీటికి అధికారిక ధృవీకరణలు లేవు.
