సెన్సేషనల్ సైయారా.. లెక్క మార్చేసింది..!
బాలీవుడ్ బాక్సాఫీస్ పై సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు యువ జంట అహాన్ పాండే.. అనీత్ పడ్డ.
By: Tupaki Desk | 25 July 2025 12:31 PM ISTబాలీవుడ్ బాక్సాఫీస్ పై సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు యువ జంట అహాన్ పాండే.. అనీత్ పడ్డ. మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సైయారా సినిమాలో వీరిద్దరు జంటగా నటించారు. సినిమా రిలీజ్ ముందు ఒక మోస్తారు బజ్ క్రియేట్ చేయగా లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. డే బై డే సినిమా లెక్కకు మించి వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే 100 కోట్లు, 150 కోట్ల ఫిగర్స్ దాటేసిన ఈ సినిమా 200 కోట్లకు దగ్గర్లో ఉంది.
సైయారా సినిమా ఈ రేంజ్ సెన్సేషన్స్ క్రియేట్ చేయగలదని మేకర్స్ నమ్మినా కూడా సినిమాకు వస్తున్న రెవిన్యూ చూస్తుంటే వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. ఒక యువ జంట ఈ రేజ్ బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించడం చూసి అవాక్కవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ ట్రెండింగ్ లో సైయారా ఉంది. సినిమా మౌత్ టాక్ మరింత బలపడింది. రెండో వారం కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. సినిమాకు బలమైన మౌత్ టాక్ ఎంతగా ప్రభావితం చూపిస్తుందో సైయారా వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది.
ఐతే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనేశారు. మామూలుగా అయితే ఇదివరకు ఒక సినిమా రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ రావాలి. కానీ ఈ కండీషన్ ని ఎప్పుడో బ్రేక్ చేసి ఈమధ్య చాలా సినిమాలు ముఖ్యంగా మంచి సక్సెస్ అయిన సినిమాలు, పెద్దగా మెప్పించని సినిమాలు ఇలా అన్ని కూడా 3, 4 వారాల లోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.
సైయారా సినిమా థియేట్రికల్ రన్ సూపర్ సాలిడ్ గా దూసుకెళ్తుంది. అందుకే యష్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను ఈ ఇయర్ దీపావళికి ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ రిలీజ్ తర్వాత కూడా ఎలాంటి ఎక్స్ ట్రా ఛార్జ్ లాంటివి లేకుండా సినిమా చూసేలా ఏర్పాటు చేస్తున్నారట.
మొత్తానికి థియేట్రికల్ హిట్ మాత్రమే కాదు ఓటీటీ విషయంలో కూడా చాలా మంచి ఆలోచనతోనే ఇలా చేస్తున్నారని చెప్పొచ్చు. సో సైయారా ఓటీటీ ఎంత లేట్ అయితే అంత లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు దానికి తోడు అదే రేంజ్ వసూళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
