Begin typing your search above and press return to search.

ఆల‌స్యంగా వ‌స్తాడు.. చైన్ స్మోక‌ర్ ఈ యంగ్ హీరో

ఓవ‌ర్ నైట్‌లో స్టార్ అయ్యాడు అహాన్ పాండే. చంకీ పాండే న‌ట‌వార‌సుడిగా అత‌డు పాండే వంశానికి గుర్తింపును తెచ్చాడు.

By:  Tupaki Desk   |   25 July 2025 9:45 AM IST
ఆల‌స్యంగా వ‌స్తాడు.. చైన్ స్మోక‌ర్ ఈ యంగ్ హీరో
X

ఓవ‌ర్ నైట్‌లో స్టార్ అయ్యాడు అహాన్ పాండే. చంకీ పాండే న‌ట‌వార‌సుడిగా అత‌డు పాండే వంశానికి గుర్తింపును తెచ్చాడు. చంకీ పాండే, అనన్య పాండే వ‌ల్ల కానిది ఈ యువ‌న‌టుడితో సాధ్య‌మైంది. `సైయారా` సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేసిన అహాన్ పాండే న‌ట ప్ర‌తిభ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. చాలా మంది అగ్ర క‌థానాయ‌కులు, పెద్ద కుటుంబాల నుంచి వ‌చ్చిన న‌టవార‌సులు డిజాస్ట‌ర్ల‌తో కెరీర్ ని ప్రారంభిస్తే, అందుకు భిన్నంగా అహాన్ 100 కోట్ల క్ల‌బ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. అత‌డు ఇత‌ర న‌ట‌వార‌సుల్లాగా ప్లాస్టిక్ ఎక్స్ ప్రెష‌న్స్ తో చంప‌డు.

సైయారా చిత్రం కేవ‌లం 6 రోజుల్లో రూ. 154 కోట్లు వసూలు చేసింది. అయితే అహాన్ గురించి ఇంత‌కుముందు అత‌డి సోద‌రి అల‌నా పాండే ఒక టాప్ సీక్రెట్ చెప్పింది. అహాన్ ఇంట్లో ఉన్న‌ప్పుడు బాత్రూమ్ కి వెళ్లి సిగ‌రెట్లు తాగుతాడ‌ని చెప్పింది. ఇప్పుడు దీనిని అత‌డి స్నేహితుడు, కోస్టార్ కూడా కన్ఫామ్ చేసాడు. షూటింగులు లేదా ప్రాక్టీస్ సెష‌న్స్ కి ఆల‌స్యంగా వ‌స్తాడ‌ని, చైన్ స్మోక‌ర్ అని అహాన్ గురించి స‌హ‌న‌టుడు నిఖిల్ చెప్పాడు. అయితే న‌టుడిగా అత‌డి డెడికేష‌న్ అద్భుతమ‌ని కొనియాడాడు. ఏదైనా స‌న్నివేశం ఇచ్చి న‌టించ‌మంటే చంపుతాడు. ఒక గే సీన్ లో స‌హ‌చ‌రుడికి ఎయిడ్స్ మందు ఇవ్వాలి. ఆ సీన్ లో అత‌డు చంపాడు. అలాంటి సీన్ నాకు రాకూడ‌ద‌ని అనుకున్నాను.. కానీ అహాన్ దానిని చంపాడు! అని ప్ర‌శంసించాడు. నేను ద్వేషించాల‌నుకునేంత గొప్ప న‌టుడు అహాన్ పాండే అని స‌హ‌న‌టుడు నిఖిల్ అన్నారు. 21 ఏళ్ల అహాన్ సినీ న‌టుడి బిడ్డ‌. ఒక రకమైన వింత మనిషి.. కానీ కెమెరా ముందుకు వ‌స్తే గొప్పవాడు అని స‌హ‌చ‌రుడు వెల్ల‌డించారు.

అహాన్ పాండే ను నెటిజనులు రణబీర్ కపూర్‌తో పోలుస్తున్నారు. మరిన్ని సినిమాల్లో ఆహాన్ న‌ట‌న‌ను చూడాల‌ని ప్రేక్ష‌కులు హార్ట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. అత‌డికి మంచి భ‌విష్య‌త్ ఉంది. `సైయారా` అన్ స్టాప‌బుల్ గా 200 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ చెబుతోంది. ఇది హృతిక్ రోష‌న్ `క‌హోనా ప్యార్ హై` కంటే పెద్ద హిట్ చిత్రంగా నిల‌వ‌నుంది.