Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ - పవన్.. ఆ గాయం ఇంకా మానలేదు

మొదటి రెండు సినిమాలు మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచాయి

By:  Tupaki Desk   |   10 Jan 2024 12:21 PM GMT
త్రివిక్రమ్ - పవన్.. ఆ గాయం ఇంకా మానలేదు
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో ఏదో ఒక విధంగా త్రివిక్రమ్ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాలలో త్రివిక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి సినిమాలు వచ్చాయి.

మొదటి రెండు సినిమాలు మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచాయి. దాంతో అజ్ఞాతవాసి మీద ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అనిరుద్ తెలుగులో మొదటిసారి మ్యూజిక్ అందిస్తోన్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కట్ కూడా సినిమాకి ఊపు తీసుకొచ్చాయి.

గురూజీ పవన్ కళ్యాణ్ కి మూడో హిట్ ఇస్తున్నాడని అందరూ అనుకున్నారు. అయితే బెన్ ఫిట్ షోకి ఈ మూవీ రిజల్ట్ ఏంటనేది తెలిసిపోయింది. కంప్లీట్ గా ఫ్యాన్స్ ని అజ్ఞాతవాసి నిరుత్సాహపరిచింది. ఆ తరువాత తిరిగి పుంజుకోలేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటికే అజ్ఞాతవాసి పేరుతో పవన్ కళ్యాణ్ మీద చాలా మంది రాజకీయంగా విమర్శించడానికి ఈ సినిమా ఒక కారణం అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆరేళ్ళు పూర్తి పూర్తయ్యింది. ఇప్పటికి ఫ్యాన్స్ అజ్ఞాతవాసి అనుభవాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఈ సినిమా చూసి ఏ స్థాయిలో షాక్ ఇచ్చారో అని పోస్ట్ లు పెడుతున్నారు. ఆ తరువాత ఇద్దరు కాంబినేషన్ లో సినిమాలు రాకపోయిన కూడా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకి వెనకుండి సహాయ సహకారాలని త్రివిక్రమ్ అందించారు.

అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి అజ్ఞాతవాసి డిజాస్టర్ అనంతరం మరల సాలిడ్ సక్సెస్ ఇప్పటి వరకు రాలేదు. త్రివిక్రమ్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ చిత్రం మారింది. ఖలేజా ఫ్లాప్ అయిన తరువాత టీవీలలో ప్రేక్షకులకి నచ్చింది. కానీ అజ్ఞాతవాసి మాత్రం ఎప్పుడు చూసిన ఆడియన్స్ ని ఇరిటేట్ చేస్తూ ఉంటుందనే మాట వినిపిస్తోంది.